AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alcohol Prices: మందుబాబులకు షాకింగ్ న్యూస్.. మద్యం ధరలు పెంపు..! ఎంతంటే..?

సమ్మర్‌లో చిల్ బీర్ తాగాలనుకునేవారికి షాక్ తగలనుంది. బీర్ల ధరలు ఒక్కసారిగా పెంచేందుకు కంపెనీలు రెడీ అవుతున్నాయి. యుద్ద పరిస్థితులు క్రమంలో ప్యాకేజింగ్, సీసాల ధరలు పెరిగాయి. దీంతో కంపెనీలపై అదనపు భారం పడుతోంది. ఈ క్రమంలో ధరల పెంపు ఉండనుంది.

Alcohol Prices: మందుబాబులకు షాకింగ్ న్యూస్.. మద్యం ధరలు పెంపు..! ఎంతంటే..?
Beer
Venkatrao Lella
|

Updated on: Mar 25, 2026 | 9:32 PM

Share

మందుబాబులకు బిగ్ షాక్. బీర్ల ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఖర్చులు పెరుగుతున్న క్రమంలో ధరలను పెంచేందుకు కంపెనీలు సిద్దమవుతున్నాయి. బీర్ల ఉత్పత్తికి ఖర్చు పెరిగిందని, దీని ధరలను పెంచక తప్పదని బ్రూవర్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఉత్పత్తి ట్యాక్సులు, ఇతర ఖర్చులు పెరగడంతో బీర్ల తయారీ కంపెనీలు సతమతమవుతున్నాయి. పన్నుల కారణంగా ఉత్పత్తి ఖర్చులు 12 నుంచి 15 శాతం వరకు పెరిగాయని, కంపెనీలపై అదనపు భారం పడుతుందని స్పష్టం చేసింది. ఇక బీరు సీసాల ధరలు కూడా భారీగా పెరిగాయి.

పెరిగిన ఉత్పత్తి ఖర్చు

బీర్ సీసాల ధరలు 20 శాతం పెరిగాయి. ఇక ఇతర మెటిరీయల్ ఖర్చులు కూడా 20 నుంచి 25 శాతం పెరిగాయి. అంతేకాకుండా రవాణా ఖర్చులు కూడా 10 శాతం మేర పెరిగాయి. దీంతో బీర్ల తయారీకి అయ్యే ఖర్చులు పెరగడంతో వినియోగదారులపై ఈ భారాన్ని మోపేందుకు కంపెనీలు సిద్దమవుతున్నాయి. నష్టంతో కంపెనీలు అమ్మకాలు జరపాల్సిన అవసరం ఉందని, దీని వల్ల రానున్న రోజుల్లో బీర్ల ధరలు పెంచక తప్పదని బ్రూవర్స్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఇప్పటికే బీర్ల ధరలు గణనీయంగా పెరిగాయి. మళ్లీ ఇప్పుడు పెంచితే మందుబాబులకు షాక్ అని చెప్పవచ్చు. దేశంలో ఏబీ ఇన్‌బెవ్, కార్ల్‌బర్గ్ కంపెనీలు 85 శాతం బీర్ అమ్మకాలను చేపడుతున్నాయి.

పెరిగిన ప్యాకేజింగ్ ఖర్చులు

ఖర్చులు పెరుగుతుండటంతో బీర్ల ధరలను పెంచాలని కంపెనీలు భావిస్తున్నాయి. త్వరలోనే ధరల పెంపు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ప్యాకేజింగ్ ఖర్చులు పెరగడంతో కంపెనీలకు మార్జిన్ ఖర్చులు తగ్గుతున్నాయి. దీంతో తక్షణమే ధరలను పెంచేందుకు కంపెనీలు రెడీ అవుతున్నాయి. గత కొద్ది నెలల్లోనే బీర్ల ఉత్పత్తికి ఖర్చు 15 శాతం పెరిగింది. బీర్ల బాటిల్ గాజు ధర 20 శాతం పెరిగింది. ఇక ప్యాకేజింగ్‌కు కాగితం ధర 100 శాతం పెరిగింది. ఇక పీఈ, ఎల్‌డీపీఈ ప్లాస్టిక్ ధరలు 25 శాతం వరకు పెరిగాయి. ఈ క్రమంలో ప్రతీ బీర్ కేస్‌పై రూ.20 మేర ధరను పెంచేందుకు కంపెనీలు సిద్దమవుతున్నాయి. కాగా మద్యం ధరలను పెంచే అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. ఇది రాష్ట్రాల చేతుల్లో ఉంటుంది. దీంతో కంపెనీలు రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది.

Follow Us
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. బీర్ల ధరలు పెంపు..!
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. బీర్ల ధరలు పెంపు..!
TGPSC కీలక ప్రకటన: OTR Update గడువు మళ్లీ పొడిగింపు! వివరాలివే..
TGPSC కీలక ప్రకటన: OTR Update గడువు మళ్లీ పొడిగింపు! వివరాలివే..
శుభకార్యాల్లో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? వెనుక రహస్యం ఏమిటి?
శుభకార్యాల్లో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? వెనుక రహస్యం ఏమిటి?
ఏసీ అక్కర్లేదు! ఈ 5 సింపుల్‌ చిట్కాలతో మీ ఇల్లు సహజంగానే ఏసీలా
ఏసీ అక్కర్లేదు! ఈ 5 సింపుల్‌ చిట్కాలతో మీ ఇల్లు సహజంగానే ఏసీలా
గ్యాస్ కొరత.. దేశ ప్రజలకు కేంద్రం బిగ్ రిలీఫ్..
గ్యాస్ కొరత.. దేశ ప్రజలకు కేంద్రం బిగ్ రిలీఫ్..
కాజు మఖాన కూర.. ఇలా చేస్తే రుచి అదిరిపోద్ది బాసూ
కాజు మఖాన కూర.. ఇలా చేస్తే రుచి అదిరిపోద్ది బాసూ
డబ్బు ఖర్చులేదు..లాండ్రీకి వెళ్లనక్కర్లేదు! ఖరీదైన బట్టలను ఇంట్లో
డబ్బు ఖర్చులేదు..లాండ్రీకి వెళ్లనక్కర్లేదు! ఖరీదైన బట్టలను ఇంట్లో
దొంగలు రూటు మార్చారు జాగ్రత్త.. బైక్‌పై వచ్చి ఏం చేశారంటే..
దొంగలు రూటు మార్చారు జాగ్రత్త.. బైక్‌పై వచ్చి ఏం చేశారంటే..
అమెరికాకు ఇరాన్ బిగ్ షాక్.. తమ డిమాండ్లకు ఓకే అంటేనే యుద్ధం..
అమెరికాకు ఇరాన్ బిగ్ షాక్.. తమ డిమాండ్లకు ఓకే అంటేనే యుద్ధం..
నాగుపాముకే నరకం చూపించే మొనగాళ్లు.. కోబ్రా విషం వీటికి నీళ్లతో..
నాగుపాముకే నరకం చూపించే మొనగాళ్లు.. కోబ్రా విషం వీటికి నీళ్లతో..