AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Finance Tips: ఒకే బ్యాంకులో రెండు లేదా మూడు అకౌంట్లను ఓపెన్ చేయవచ్చా..? బ్యాంకింగ్ రూల్స్ ఏం చెబుతున్నాయి..?

ఆర్దిక కార్యకలాపాల కోసం ఎక్కువమంది రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను వినియోగిస్తూ ఉంటారు. ఇక ఒకే బ్యాంకులో కూడా ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లను కలిగి ఉంటారు. ఇలా ఒకే బ్యాంకులో ఎక్కువ అకౌంట్లను తెరవొచ్చా.. బ్యాంకింగ్ రూల్స్ ఏం చెబుతున్నాయి..?

Finance Tips: ఒకే బ్యాంకులో రెండు లేదా మూడు అకౌంట్లను ఓపెన్ చేయవచ్చా..? బ్యాంకింగ్ రూల్స్ ఏం చెబుతున్నాయి..?
Bank Accounts
Venkatrao Lella
|

Updated on: Mar 25, 2026 | 7:41 PM

Share

ప్రభుత్వ పథకాల సొమ్మును నేరుగా పొందేందుకు, ఆర్ధిక లావాదేవీలు నిర్వహించుకునేందుకు, డబ్బులు పొదుపు చేసుకునేందుకు ప్రతీఒక్కరికీ బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరి. ఇప్పటికాలంలో ప్రతీఒక్కరూ తప్పనిసరిగా ఏదైనా ఒక బ్యాంక్ అకౌంట్ కలిగి ఉంటున్నారు. ఇక ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను మెయింటైన్ చేసేవారు కూడా చాలామందే ఉన్నారు. ఆర్ధిక అవసరాల కోసం ఎక్కువశాతం మంది రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలను కూడా వాడుతున్నారు. వేర్వేరు బ్యాంకుల్లో అకౌంట్లను కలిగి ఉంటుండగా.. ఒకే బ్యాంకులో ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లను ఓపెన్ చేయవచ్చా? అనే అనుమానం చాలామందికి ఉంటుంది. దానికి సమాధానం ఇందులో చూద్దాం.

ఒకే బ్యాంకులో రెండు అకౌంట్లు ఉండవచ్చా..?

ఒకే బ్యాంకులో ఒకటి కంటే ఎక్కువ అకౌంట్లను ఓపెన్ చేసే అవకాశం ఉంది. ఒకటి సేవింగ్స్ అకౌంట్, మరొకటి జాయింట్ అకౌంట్.. ఫిక్స్‌డ్ డిపాజిట్ అకౌంట్.. ఇలా ఒకే బ్యాంకులో మల్టీపుల్ అకౌంట్లు తెరవొచ్చు. ఇందుకు బ్యాంకింగ్ రూల్స్ అనుమతిస్తున్నాయి. అయితే బ్యాంకుల వ్యక్తిగత నిబంధనలను బట్టి ఇవి మారుతూ ఉంటాయి.

బ్యాంక్ అకౌంట్లపై లిమిట్ ఉందా..?

ఇక ఎన్ని బ్యాంక్ అకౌంట్లను ఒక వ్యక్తి కలిగి ఉండాలనే దానిపై నిబంధనలు ఏం లేవు. ఎన్ని ఖాతాలను అయినా కలిగి ఉండవచ్చు. అయితే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లను కలిగి ఉండటం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే ప్రతీ బ్యాంక్ అకౌంట్లలో మినిమం బ్యాలెన్స్‌ను ఎల్లప్పుడూ ఉంచాల్సి ఉంటుంది. ఒకవేళ మెయింటైన్ చేయకపోతే బ్యాంకులు జరిమానా విధిస్తూ ఉంటాయి. అంతేకుండా ఎక్కువ బ్యాంకు అకౌంట్లు ఉంటే వాటిని ట్రాక్ చేయడం కూడా కష్టంగా ఉంటుంది. దీంతో రెండు లేదా మూడు అకౌంట్లు కలిగి ఉంటే మంచిదని, అంతకంటే ఎక్కువ అవసరం లేదని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే డెబిట్ కార్డ్ ఛార్జీలు, ఎస్‌ఎంఎస్‌లు పొందేందుకు వార్షిక సర్వీస్ ఛార్జీలు వంటివి చెల్లించాల్సి ఉంటుంది. దీంతో మీకు ఆర్ధికంగా నష్టమే జరుగుతుంది.

ఇలా చేస్తే ప్రయోజనం

అత్యవసర అవసరాల కోసం సేవింగ్స్ అకౌంట్ ఒకటి ఉండాలి. ఇక దీర్ఘకాలంలో డబ్బులు పొదుపు చేసుకునేందుకు మరో అకౌంట్ ఉండాలి. ఇక ఏమైనా ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తుంటే దాని కోస ప్రత్యేక అకౌంట్ తెరవాలి. ఇలా చేయడం వల్ల ఎందుకు ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నామనే విషయాలు సులువుగా తెలుస్తాయి. దీని వల్ల మన ఆర్ధిక విషయాలను ప్లాన్ చేసుకోవచ్చు.

Follow Us