బాబోయ్.. 2 ఏళ్లకే 400 శాతం రిటర్న్స్.. ఈ మల్టీబ్యాగర్ స్టాక్ లెక్కలు చూస్తే మతిపోద్దంతే..!
Best Returns in 2 Years: ఈ ఫార్మా స్టాక్ గత కొన్ని ఏళ్లుగా అద్భుతమైన పనితీరుతో మల్టీబ్యాగర్‌గా నిలిచింది. జూన్ 18న జరిగే బోర్డు సమావేశం ఈ స్టాక్ భవిష్యత్తు దిశను నిర్దేశించనుంది. అయితే, స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఇన్వెస్టర్లు మార్కెట్ ఒడిదుడుకులను గమనిస్తూ నిపుణుల సలహాతో పెట్టుబడులు పెట్టడం ఉత్తమం.

Multibagger Stock: షేర్ మార్కెట్‌లో తక్కువ కాలంలోనే ఇన్వెస్టర్ల భాగ్యాన్ని మార్చేసే మల్టీబ్యాగర్ స్టాక్స్ కోసం అందరూ వెతుకుతుంటారు. అలాంటి వారి కన్ను ఇప్పుడు ఒక చిన్న ఫార్మా కంపెనీ షేరుపై పడింది. కేవలం రెండేళ్లలోనే ఏకంగా 400 శాతం పైగా లాభాలను అందిస్తూ, దూసుకుపోతున్న ఆ స్మాల్ క్యాప్ స్టాక్ వివరాలు, రాబోయే కీలక పరిణామాలు ఓసారి చూద్దాం..
ఇన్వెస్టర్ల రడార్‌లో సుదర్శన్ ఫార్మా ఇండస్ట్రీస్..
భారతీయ స్టాక్ మార్కెట్ (Stock Market) లో ఫార్మా రంగానికి చెందిన ఒక చిన్న షేరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అదే సుదర్శన్ ఫార్మా ఇండస్ట్రీస్ (Sudarshan Pharma Industries). నిన్నటి ట్రేడింగ్‌లో ఈ స్మాల్ క్యాప్ స్టాక్ సరికొత్త 52- వారాల రికార్డును సృష్టించి రూ. 38 స్థాయికి చేరుకుంది. అయితే, ఈరోజు మార్కెట్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ (Profit Booking) జరగడం వల్ల ఈ షేరు దాదాపు 3 శాతం స్వల్పంగా క్షీణించి రూ. 37 దిగువన ట్రేడవుతోంది. అయినప్పటికీ, గత రెండేళ్లలో ఈ కంపెనీ ఇన్వెస్టర్లకు ఇచ్చిన రిటర్న్స్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.
రిటర్న్స్ అదరహో.. ఐదేళ్లలో 500 శాతం లాభాలు..
సుదర్శన్ ఫార్మా కేవలం లాంగ్ టర్మ్‌లోనే కాకుండా షార్ట్ టర్మ్‌లోనూ ఇన్వెస్టర్లకు బంపర్ ప్రాఫిట్స్ అందించింది. గడిచిన ఒక నెల రోజుల్లోనే ఈ మల్టీబ్యాగర్ స్టాక్ (Multibagger Stock) విలువ 20 శాతం పెరిగింది. అలాగే గత 3 నెలల్లో 55 శాతం, ఆరు నెలల్లో 45 శాతం మేర లాభాలను పంచింది. ఇక రెండేళ్ల క్రితం ఈ షేరులో పెట్టుబడి పెట్టిన వారికి ఏకంగా 400 శాతం బంపర్ రిటర్న్స్ వచ్చాయి. మూడేళ్ల ట్రాక్ రికార్డు చూస్తే 438 శాతం, ఐదేళ్ల కాలంలో సుమారు 500 శాతం మేర వృద్ధిని నమోదు చేసి ఇన్వెస్టర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంది. అంటే ఈ స్టాక్‌లో రూ. లక్ష పెట్టుబడి పెడితే, కేవలం రెండేళ్లలోనే 455 శాతం లాభాలు అందించింది. అంటే పెట్టుబడి మొత్తం 5.50లక్షలుగా మారింది.
జూన్ 18 బోర్డు మీటింగ్‌పైనే అందరి కళ్లు..
కంపెనీ జూన్ 15న ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఒక కీలక ప్రకటన చేసింది. జూన్ 18, 2026 న కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ (Board of Directors) ఒక ముఖ్యమైన సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ మీటింగ్‌లో కంపెనీకి అవసరమైన అదనపు నిధుల సమీకరణ (Fund Raising) ప్రతిపాదనపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. ఈ ప్లాన్ ప్రకారం ఈక్విటీ షేర్లు, వారెంట్లు, కన్వర్టిబుల్ సెక్యూరిటీలు లేదా డెట్ సెక్యూరిటీల ద్వారా నిధులను సేకరించే అవకాశం ఉంది. కంపెనీ ఇంకా ఎంత మొత్తం సేకరిస్తుంది, దాని ఖచ్చితమైన ఉద్దేశం ఏంటనేది వెల్లడించనప్పటికీ, మార్కెట్ నిపుణులు దీనిని ఈ స్టాక్‌కు ఒక పెద్ద ట్రిగర్‌గా భావిస్తున్నారు.
ప్రమోటర్ల వాటా పెరుగుదల.. మార్కెట్లో సానుకూల సంకేతాలు..
ఫండ్ రైజింగ్ ప్లాన్‌కు ముందే జూన్ 12న కంపెనీ వారెంట్ కమిటీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమోటర్ కేటగిరీ ఇన్వెస్టర్లకు 9 లక్షల వారెంట్ల కన్వర్షన్ తర్వాత, ఒక్కో షేరుకు రూ. 16.983 ధర చొప్పున 90 లక్షల ఈక్విటీ షేర్ల కేటాయింపునకు ఆమోదం తెలిపింది. దీని ద్వారా కంపెనీకి రూ. 11.46 కోట్ల అదనపు మూలధనం లభించింది. సాధారణంగా కంపెనీలో ప్రమోటర్ల (Promoters) వాటా పెరగడాన్ని మార్కెట్ ఎప్పుడూ ఒక పాజిటివ్ సైన్‌గా చూస్తుంది. ఈ నిధులను కంపెనీ అప్పులు తగ్గించుకోవడానికి వాడనుందా లేదా బిజినెస్ విస్తరణకు ఉపయోగించనుందా అనే క్లారిటీ వస్తే, ఈ షేరులో తదుపరి బుల్ రన్ (Bull Run) ప్రారంభం కావచ్చు.
(గమనిక/Disclaimer: ఈ కథనంలో ఇచ్చిన సమాచారం కేవలం స్టాక్ పనితీరు ఆధారంగా అందించినది మాత్రమే. షేర్ మార్కెట్ పెట్టుబడులు మార్కెట్ రిస్క్‌లకు లోబడి ఉంటాయి. పెట్టుబడి పెట్టే ముందు సర్టిఫైడ్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ సలహా తీసుకోగలరు.)
తరచుగా అడిగే ప్రశ్నలు (Frequently Asked Questions – F&Q)
1. సుదర్శన్ ఫార్మా ఇండస్ట్రీస్ గత రెండేళ్లలో ఎంత రిటర్న్స్ ఇచ్చింది?
సుదర్శన్ ఫార్మా ఇండస్ట్రీస్ షేరు గత రెండేళ్ల కాలంలో తన ఇన్వెస్టర్లకు ఏకంగా 400 శాతం పైగా బంపర్ రిటర్న్స్ అందించింది.
2. సుదర్శన్ ఫార్మా షేరు 52-వారాల గరిష్ట (52-Week High) ధర ఎంత?
ఈ మల్టీబ్యాగర్ స్టాక్ ఇటీవల సరికొత్త 52-వారాల గరిష్ట స్థాయి అయిన రూ. 38 మార్కును తాకింది.
3. జూన్ 18న జరగబోయే బోర్డు మీటింగ్ ప్రాధాన్యత ఏంటి?
జూన్ 18, 2026న జరిగే బోర్డు సమావేశంలో కంపెనీ ఈక్విటీ, వారెంట్లు లేదా డెట్ సెక్యూరిటీల ద్వారా అదనపు నిధుల సమీకరణ (Fund Raising) ప్రతిపాదనలను పరిశీలించి ఆమోదించనుంది.
4. ఇటీవల ప్రమోటర్ల వాటా కేటాయింపు ద్వారా కంపెనీకి ఎంత నిధులు వచ్చాయి?
9 లక్షల వారెంట్ల కన్వర్షన్ ద్వారా ప్రమోటర్లకు 90 లక్షల ఈక్విటీ షేర్లను కేటాయించారు. దీని ద్వారా కంపెనీకి రూ. 11.46 కోట్ల అదనపు మూలధనం సమకూరింది.
5. ఈ స్టాక్‌లో పెట్టుబడి పెట్టడం సురక్షితమేనా?
సుదర్శన్ ఫార్మా అద్భుతమైన రిటర్న్స్ ఇచ్చినప్పటికీ ఇదొక స్మాల్ క్యాప్ కంపెనీ. స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో అస్థిరత, రిస్క్ ఎక్కువగా ఉంటాయి, కాబట్టి ఇన్వెస్ట్ చేసే ముందు ఫైనాన్షియల్ అడ్వైజర్‌ను సంప్రదించడం మంచిది.
