AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాట్నా స్టేషన్‌లో వింత దృశ్యం..ప్లాట్‌ఫామ్ నిండా పాదముద్రలే

పాట్నా స్టేషన్‌లో వింత దృశ్యం..ప్లాట్‌ఫామ్ నిండా పాదముద్రలే

Phani CH
|

Updated on: Mar 25, 2026 | 5:37 PM

Share

బీహార్‌లోని పాట్నా రైల్వే స్టేషన్‌లో వింత ఘటన చోటుచేసుకుంది. కొత్తగా వేసిన తడి కాంక్రీట్ ప్లాట్‌ఫామ్‌పైకి అధికారులు రైలును అనుమతించారు. వందలాది మంది ప్రయాణికులు దానిపై నుంచి నడవడంతో ప్లాట్‌ఫామ్ పూర్తిగా దెబ్బతిని, చేసిన పనంతా వృథా అయింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో రైల్వే అధికారుల నిర్లక్ష్యంపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

భారతీయ రైల్వేలో అప్పుడప్పుడు కొన్ని వింత సంఘటనలు జరుగుతుంటాయి. కానీ, బీహార్‌లోని పాట్నా రైల్వే స్టేషన్‌లో జరిగిన తాజా ఘటన మాత్రం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది. ప్లాట్‌ఫామ్ మరమ్మతుల కోసం కొత్తగా వేసిన కాంక్రీట్ ఆరకముందే, వందలాది మంది ప్రయాణికులు దానిపై నుంచి నడుచుకుంటూ వెళ్లడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పాట్నా స్టేషన్‌లోని ఒక ప్లాట్‌ఫామ్‌పై రైల్వే సిబ్బంది మరమ్మతు పనులు చేపట్టారు. సిమెంట్‌, కాంక్రీట్ మిశ్రమంతో ప్లాట్‌ఫామ్‌ను సిద్ధం చేశారు. అయితే, ఆ కాంక్రీట్ కనీసం గంట కూడా ఆరకముందే, అధికారులు అదే ప్లాట్‌ఫామ్‌పైకి ఒక రైలును అనుమతించారు. రైలు ఆగడమే ఆలస్యం.. ప్రయాణికులంతా తమ లగేజీలతో కిందకు దిగారు. ప్లాట్‌ఫామ్ తడిగా ఉందని తెలిసినా, బయటకు వెళ్లేందుకు మరో దారి లేకపోవడంతో వారంతా ఆ కాంక్రీట్‌పైనుంచే నడిచి వెళ్లారు. వందలాది మంది ప్రయాణికులు నడవడంతో ప్లాట్‌ఫామ్ రూపమే మారిపోయింది. ప్రతి అడుగుకూ లోతైన పాదముద్రలు పడిపోవడంతో చేసిన పనంతా వృథా అయిపోయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు అధికారులపై మండిపడుతున్నారు. పగటిపూట రద్దీగా ఉండే సమయంలో ఇలాంటి పనులు చేయడం ఏంటి? అని కొందరు ప్రశ్నిస్తుంటే, ప్రభుత్వ ధనం బూడిదలో పోసిన పన్నీరైంది అని మరికొందరు విమర్శిస్తున్నారు. వైరల్ అవుతున్న వీడియోలో కొందరు ప్రయాణికులు ఈ వింత పరిస్థితిని చూసి నవ్వుకుంటూ వెళ్తుండగా, మరికొందరు మాత్రం బురద లాంటి కాంక్రీట్‌లో కాళ్లు దిగబడుతుంటే అధికారుల తీరును తిట్టుకుంటూ వెళ్లారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏప్రిల్ 1 నుంచి ‘కొత్త ఐటీ చట్టం-2025’.. కీలక మార్పులివే

ఈపీఎఫ్ఓ సంచలన నిర్ణయం.. క్లెయిమ్ చేయని డబ్బులు నేరుగా ఖాతాల్లోకి

గ్యాస్‌ బండ చోరీకి ప్లాన్.. కానీ అడ్డంగా బుక్కయ్యాడు

మానవత్వం మరిచిన సంస్థకు.. రూ.210 కోట్ల ఫైన్ వేసిన కోర్టు

రైలులో చిన్నారికి అస్వస్థత.. మునగ సూప్‌ తాగించడంతో వాంతులు.. అప్పుడే ఓ అద్భుతం

Follow Us