మానవత్వం మరిచిన సంస్థకు.. రూ.210 కోట్ల ఫైన్ వేసిన కోర్టు
టోటల్ క్వాలిటీ లాజిస్టిక్స్ (TQL) సంస్థకు $22.5 మిలియన్ల భారీ జరిమానా పడింది. గర్భవతి అయిన చెల్సియా వాల్ష్‌కు వర్క్ ఫ్రమ్ హోమ్ నిరాకరించడం, దానివల్ల ఆమె అకాల ప్రసవమై, చిన్నారి మగ్నోలియా 90 నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోవడంతో కోర్టు కంపెనీ నిర్లక్ష్యానికి బాధ్యత వహించింది. ఇది ఉద్యోగుల హక్కులు, కార్పొరేట్ బాధ్యతపై చర్చకు దారితీసింది.
అమెరికాలో ‘టోటల్ క్వాలిటీ లాజిస్టిక్స్’ లో చెల్సియా వాల్ష్ అనే మహిళ పని చేసేవారు. 2021లో ఆమె గర్భం దాల్చిన సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. అకాల ప్రసవం కాకుండా ఉండేందుకు ఆమెకు ఆపరేషన్ కూడా జరిగింది. డాక్టర్లు ఆమెకు ఖచ్చితమైన బెడ్ రెస్ట్ అవసరమని, ఇంటి నుంచే పని చేయాలని సూచించారు. తన అనారోగ్య పరిస్థితులను వివరిస్తూ చెల్సియా వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే సంస్థ యాజమాన్యం ఆ విన్నపాన్ని తోసిపుచ్చింది.”ఆఫీసుకి వచ్చి పనిచేయాలి.. లేదంటే జీతం లేని సెలవు తీసుకోవాలి” అని తెగేసి చెప్పింది. ఆర్థిక అవసరాలు, ఇన్సూరెన్స్ వంటి కారణాల వల్ల ఆమె గత్యంతరం లేక డాక్టర్ల మాటను కాదని మూడు రోజుల పాటు ఆఫీసుకి వెళ్లి పనిచేశారు. కంపెనీ చివరకు ఫిబ్రవరి 24వ తేదీన ఆమె వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేందుకు అనుమతిచ్చింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అదే రోజు చెల్సియాకు నొప్పులు మొదలయ్యాయి. కేవలం 21 వారాల గర్భంతోనే ఆమె మగ్నోలియా అనే ఆడ బిడ్డకు జన్మను ఇచ్చింది. అయితే పుట్టినప్పుడు ఆ చిన్నారి గుండె కొట్టుకుంటోంది. శ్వాస కూడా బాగానే తీసుకుంటోంది. బిడ్డను తల్లి చెల్సియా గుండెలపై ఉంచారు. కానీ కేవలం 90 నిమిషాల తర్వాత ఆ పసిపాప తల్లి ఒడిలోనే ప్రాణాలు విడిచింది. ఆ విషాదానికి కంపెనీ నిర్లక్ష్యమే కారణమని చెల్సియా కుటుంబం కోర్టును ఆశ్రయించింది. విచారణ చేపట్టిన జ్యూరీ.. కంపెనీ వ్యవహరించిన తీరు అత్యంత బాధ్యతారాహిత్యంగా ఉందని తెలిపింది. వైద్యపరమైన అత్యవసర అభ్యర్థనను తోసిపుచ్చడం వల్లే చిన్నారి మరణించిందని జ్యూరీ నిర్ధారించింది. ఈ ఘటనలో 90 శాతం తప్పు కంపెనీదే అని స్పష్టం చేస్తూ.. 22.5 మిలియన్ డాలర్లు.. అంటే భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.210 కోట్ల భారీ జరిమానాను విధించింది. ఏడాదికి 6 బిలియన్ డాలర్ల ఆదాయం ఉన్న ఇంత పెద్ద సంస్థ.. ఒక గర్భిణీకి చిన్న సదుపాయం కల్పించలేకపోవడం దారుణమని న్యాయవాదులు వాదించారు. ఈ తీర్పుపై కంపెనీ ఉన్నత న్యాయస్థానానికి వెళ్తామని ప్రకటించింది. కానీ కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైలులో చిన్నారికి అస్వస్థత.. మునగ సూప్ తాగించడంతో వాంతులు.. అప్పుడే ఓ అద్భుతం
ఒరిజినల్ ‘ధురంధర్’ ఇతనే !! అదిరిన అసలు కథ
ఆరు బ్యాంక్‌లకు కన్నం వేసిన దొంగ.. చివరికి..
చీకటి పడ్డాక ఎండ కావాలా ?? సూర్యకాంతిని.. అమ్ముతామంటున్న స్టార్టప్ కంపెనీ
మానవత్వం మరిచిన సంస్థకు.. రూ.210 కోట్ల ఫైన్ వేసిన కోర్టు
రైలులో చిన్నారికి అస్వస్థత.. అప్పుడే ఓ అద్భుతం
ఆరు బ్యాంక్‌లకు కన్నం వేసిన దొంగ.. చివరికి..
సూర్యకాంతిని.. అమ్ముతామంటున్న స్టార్టప్ కంపెనీ
వీళ్లు అసలు మనుషులేనా ??
తమిళ స్వాముల దౌర్జన్యం.. లక్ష ఇవ్వకపోతే శపిస్తాం
ఎవడ్రా వీడు.. మటన్ ఉడకలేదు.. పోలీస్ కేసు పెట్టాడు..

