క్రైస్తవ మతంలోకి మారిన వారికి ఎస్సీ హక్కులు వర్తించవని సుప్రీం కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. హిందువులు, బౌద్ధులు, సిక్కులు మాత్రమే ఎస్సీ హోదాకు అర్హులు. మత మార్పిడి అనంతరం ఎస్సీ హోదా పూర్తిగా రద్దవుతుంది. ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు సమర్ధించింది. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద పాస్టర్కు రక్షణ ఉండదని కోర్టు స్పష్టం చేసింది.