AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాగుపాముకే నరకం చూపించే మొనగాళ్లు.. కోబ్రా విషం వీటికి నీళ్లతో సమానం..

విషపూరితమైన నాగుపామును చూస్తే మనుషులమే కాదు, అడవిలోని జంతువులు కూడా భయంతో పారిపోతాయి. అయితే ప్రకృతి చక్రంలో ఏదీ అజేయం కాదు. ఎంతటి భయంకరమైన పామునైనా చిత్తు చేయగల శక్తులు కొన్ని జీవులకు ఉన్నాయి. ముంగీస వేగం నుంచి, హనీ బ్యాడ్జర్ మొండితనం వరకు.. పాములకు యమపాశంలా మారే ఆ వింత జీవుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: Mar 25, 2026 | 8:29 PM

Share

ముంగీస: పాము-ముంగీస పోరాటం గురించి తెలియని వారు ఉండరు. ముంగీసకు ఉన్న వేగం, చురుకుదనం నాగుపాముకు అతిపెద్ద శాపం. ఇది పాము కాటు వేసేలోపే దాని తలను పట్టుకోగలదు. ముఖ్యంగా ముంగీస రక్తంలోని ఎసిటైల్కోలిన్ గ్రాహకాలు పాము విషానికి వ్యతిరేకంగా పోరాడే శక్తిని కలిగి ఉంటాయి. అందుకే పాము కాటు వేసినా వీటికి పెద్దగా ప్రమాదం జరగదు.

1 / 5
హనీ బ్యాడ్జర్: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం.. ఇది ప్రపంచంలోనే అత్యంత భయం తెలియని జంతువు. దీని చర్మం ఎంత మందంగా ఉంటుందంటే నాగుపాము కోరలు దానిని ఛేదించలేవు. ఒకవేళ నాగుపాము కాటు వేసినా హనీ బ్యాడ్జర్ కొద్దిసేపు స్పృహ కోల్పోయి, మళ్ళీ లేచి ఆ పామునే ఆరగిస్తుంది.

2 / 5
సెక్రటరీ పక్షి: ఆఫ్రికా మైదానాల్లో కనిపించే ఈ పక్షి చూడటానికి నెమ్మదిగా ఉన్నా, దీని కాళ్లు నాగుపాముకు మృత్యువుతో సమానం. ఇది తన శక్తివంతమైన కాళ్లతో సెకనులో పదో వంతు కాలంలోనే పాము తలపై దాడి చేస్తుంది. ఆ దెబ్బకు నాగుపాము పుర్రె పిండి కావాల్సిందే.

3 / 5
గద్ద: నేల మీద నాగుపాము ఎంత వేగంగా ఉన్నా, ఆకాశం నుండి వచ్చే గద్ద పంజా నుండి తప్పించుకోలేదు. గద్ద తన బలమైన గోర్లతో పాము మెడను గట్టిగా పట్టుకుని గాలిలోకి ఎగిరిపోతుంది. పాము తిరగబడే లోపే దాని కథ ముగుస్తుంది.

4 / 5
మొసలి: నాగుపాము ఒకవేళ నీటిలోకి వెళ్తే అక్కడ మొసలి రూపంలో దానికి ముప్పు పొంచి ఉంటుంది. మొసలి చర్మం అత్యంత కఠినంగా ఉండటం వల్ల పాము విషం లోపలికి వెళ్లదు. మొసలి తన దవడలతో ఒక్కసారి పట్టుకుంటే, నాగుపాము విముక్తి పొందడం అసాధ్యం.

5 / 5
Follow Us