ఉత్తరాంధ్రపై ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. తీరం వెంబడి గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ముఖ్యంగా పార్వతీపురం మన్యం, అల్లూరి, విశాఖ తదితర జిల్లాల్లో పిడుగుల ప్రమాదం ఉందని, ప్రజలు చెట్ల కింద ఉండరాదని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.