Central Government: దేశ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్.. ప్రతీఒక్కరికీ రూ.5 లక్షలు.. మీరూ ఇలా పొందవచ్చు..
దేశంలోని ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తోంది. రూ.5 లక్షల వరకు ఫ్రీ ట్రీట్‌మెంట్ పొందవచ్చు. ఇందుకోసం ఆయుష్మాన్ భారత్ అనే పథకాన్ని మోదీ ప్రభుత్వం అమలు చేస్తోేంది. దీని కింద లబ్ది పొందాలంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

దేశంలోని సామాన్యులందరికీ కేంద్ర ప్రభుత్వం రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సౌకర్యం కల్పిస్తోంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా వైద్య సదుపాయం పొందవచ్చు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉద్దేశంతో మోదీ సర్కార్ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్ ద్వారా సామాన్యులు ప్రైవేట్ హాస్పిటల్స్‌లో రూ.5 లక్షల వరకు ఉచిత ట్రీట్‌మెంట్ పొందవచ్చు. ఇక ఇంట్లో సీనియర్ సిటిజన్లు ఉంటే వారికి అదనంగా మరో రూ.5 లక్షల కవరేజీ కల్పిస్తోంది. ఈ పథకం కింద ప్రయోజనం పొందేందుకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి..? అర్హతలు ఏంటి? అనే విషయాలు తెలుసుకుందాం.
అర్హతలు ఇవే..
సొంత భూమి లేని కుటుంబాలు, వీధి వ్యాపారులు, గృహ కార్మికులు, పారిశుధ్య కార్మికులు, కండక్టర్లు, డ్రైవర్లు, సీనియర్ సిటిజన్లు ఈ పథకానికి అర్హులు. ఇక 16 నుంచి 59 ఏళ్ల వయస్సు కలిగి ఉండి పురుషుడు లేని కుటుంబాలకు కూడా ఈ పథకం వర్తిస్తుంది.
వీళ్లు అనర్హులు
-టూ, త్రీ, ఫోర్ వీలర్ కలిగినవారు
-వ్యవసాయ పరికరాలు కలిగినవారు
-ప్రభుత్వ ఉద్యోగులు
-రూ.50 వేల వరకు కిసాన్ క్రెడిట్ కార్డ్ కలిగి ఉన్నవారు అనర్హులు
-నెలవారీ ఇన్‌కమ్ రూ.10 వేలు కలిగి ఉండకూడదు
-5 ఎకరాల కంటే ఎక్కువ పోలం ఉన్నవాకి అర్హత లేదు
-రిఫ్రిజిరేటర్స్ కలిగి ఉన్న కుటుంబాలు
కావాల్సిన డాక్యుమెంట్లు
ఆధార్, రేషన్ కార్డు, ఇన్‌కమ్ సర్టిఫికేట్, మొబైల్ నెంబర్, వీధి వ్యాపారులకు లేబర్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అవసరం.
దరఖాస్తు ఎలా..?
– WWW.PMJAY.gov.in వెబ్‌సైట్లోకి వెళ్లి ముందుగా ఎలిజిబులిటీ చెక్ చేసుకోవాలి
-మీ వివరాలు ఎంటర్ చేస్తే మీరు అర్హులా… లేదా అనేది తెలుస్తుంది
-మీకు అర్హత ఉంటే కామన్ సర్వీసెస్ సెంటర్ లేదా ప్రభుత్వ నెట్ వర్క్ ఆస్పత్రులకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు
-ఆధార్, రేషన్ కార్డు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
-ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్ర కౌంటర్ ఉంటుది. అక్కడ సంప్రదించి ఉచిత వైద్యం పొందవచ్చు.
పెరుగుతున్న వైద్య ఖర్చులు
దేశంలో వైద్య ఖర్చులు పెరుగుతున్నాయి. దీంతో పేదలు కార్పొరేట్ వైద్యానికి దూరమవుతున్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో లక్షలకు లక్షలు వసూలు చేస్తారు. దీంతో ఏదైనా పెద్ద రోగం చేస్తే అప్పులు తెచ్చి మరీ వైద్యానికి ఖర్చు చేస్తున్నారు. దీంతో పేదలకు అండగా ఉండాలనే ఉద్దేశంలో మోదీ అధికారంలోకి వచ్చాక ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా ఇప్పటికే లక్షలాది మంది లబ్ది పొందుతున్నారు. ప్రతీ ఏటా లబ్దిదారుల సంఖ్య పెరుగుతూనే ఉంది.
