AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cycling: మనల్ని ఎవడ్రా ఆపేది.. పెట్రోల్‌తో పనిలేదు.. ఆరోగ్యానికి తిరుగులేదు..

ఇంధన కొరత, పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్యుడిని ఇబ్బందులు పెడుతుంటే.. నగరాల్లో గంటల తరబడి ట్రాఫిక్ నరకం చూపిస్తుంది. వీటికి తోడు కాలుష్య కోరల్లో చిక్కుకున్న నగరాలకు పరిష్కారం ఎక్కడ ఉంది అంటే సమాధానం మీ ఇంటి ముందే ఉన్న సైకిల్. ఒకప్పుడు కేవలం వ్యాయామంగా చూసిన సైక్లింగ్, నేడు ఆధునిక నగర రవాణాలో అత్యంత కీలకమైన గ్రీన్ మొబిలిటీగా మారుతోంది.

Cycling: మనల్ని ఎవడ్రా ఆపేది.. పెట్రోల్‌తో పనిలేదు.. ఆరోగ్యానికి తిరుగులేదు..
How To Save Petrol Costs With Cycling
Krishna S
|

Updated on: Mar 25, 2026 | 5:54 PM

Share

ఒకప్పుడు విలాసంగా, వ్యాయామంగా మాత్రమే భావించిన సైక్లింగ్.. ఇప్పుడు అవసరంగా మారుతోంది. పెట్రోల్ కొరత, ఆకాశాన్నంటుతున్న ఇంధన ధరలు, నగరాల్లో ట్రాఫిక్ నరకం,పెరుగుతున్న కాలుష్య స్థాయిల నేపథ్యంలో భారతీయులు మళ్లీ సైకిల్ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా బెర్లిన్, బుడాపెస్ట్ వంటి నగరాలు సైక్లింగ్‌ను రవాణా వ్యవస్థలో భాగం చేయగా ఇప్పుడు భారతీయ మెట్రో నగరాల్లోనూ అదే ఒరవడి కనిపిస్తోంది. 5 కిలోమీటర్ల లోపు ప్రయాణాలకు బైక్ లేదా కారు వాడటం వల్ల నెలకు వేల రూపాయల ఇంధన ఖర్చు అవుతోంది. సైక్లింగ్ ఈ ఖర్చును సున్నాకు తగ్గిస్తుంది. ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో వాహనాల రద్దీ వల్ల గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుపోవాల్సి వస్తోంది. సైకిల్ ద్వారా సందుల గుండా ప్రయాణించి గమ్యాన్ని త్వరగా చేరుకోవచ్చు.

నగరాల్లో మారుతున్న మౌలిక సదుపాయాలు

ముంబై సైకిల్ మేయర్ ఫెరోజా సురేష్ వంటి నిపుణులు సూచించినట్లుగా.. ఇప్పుడు భారతీయ నగరాల్లో సైకిల్ కౌన్సిలర్లు, ప్రత్యేక సైకిల్ లేన్ల ఏర్పాటుపై ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసనం ఉంది. మెట్రో స్టేషన్ల నుండి కార్యాలయాలకు చేరుకోవడానికి ఎలక్ట్రిక్ సైకిల్ షేరింగ్ వ్యవస్థలు అందుబాటులోకి వచ్చాయి. ఐటీ హబ్‌లలో సైకిల్ స్టాండ్‌లు, సైక్లిస్టుల కోసం ప్రత్యేక షవర్ రూమ్‌ల ఏర్పాటు పెరుగుతోంది. డబ్బావాలాలు, పాలు, వార్తాపత్రికలు అమ్మేవారికి సైకిల్ ప్రాణాధారం. ప్రభుత్వం వీరికి సబ్సిడీపై సైకిళ్లు అందించడం, ఉచిత రిపేర్ సెంటర్లను ఏర్పాటు చేయడం ద్వారా ఆర్థికంగా ఆదుకోవచ్చు. 2-5 కిలోమీటర్ల పరిధిలోని ప్రయాణాలకు సైకిల్ వాడకం వల్ల దేశవ్యాప్తంగా కార్బన్ ఉద్గారాలు గణనీయంగా తగ్గుతాయి.

శారీరక – మానసిక ఆరోగ్యం

జిమ్‌కు వెళ్లే సమయం లేని వారికి సైక్లింగ్ ఒక అద్భుతమైన కార్డియో వ్యాయామం. రోజూ 20 నిమిషాల సైక్లింగ్ గుండె జబ్బుల ముప్పును 10-15శాతం తగ్గిస్తుంది. ఆఫీస్ ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికి, సానుకూల దృక్పథాన్ని పెంపొందించడానికి సైక్లింగ్ ఉత్తమ మార్గమని నిపుణులు చెబుతున్నారు. కాగా కేవలం వాహనాలను మార్చడమే కాదు మన ఆలోచనా ధోరణిని మార్చుకోవాల్సిన సమయం ఇది. చిన్న చిన్న పనులకు కారు తీయకుండా, నడక లేదా సైక్లింగ్‌ను ఎంచుకోవడం వల్ల పర్యావరణానికి ఎంతో మేలు చేసినట్లు అవుతుంది. ఇంధనంతో పాటు మెయింటెనెన్స్ ఖర్చులు తప్పుతాయి. పరిసరాలను గమనిస్తూ చేసే ప్రయాణం కొత్త అనుభూతినిస్తుంది.

Follow Us