AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ శ్రీరామ నవమి మీ జాతకాన్ని మార్చేస్తుంది.. ఎవరు ఆ అదృష్ట రాశులు?

Zodiac Signs Luck: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ సంవత్సరం శ్రీరామ నవమి రోజు ఏర్పడుతున్న గ్రహస్థితులు కొన్ని రాశుల వారికి ప్రత్యేకమైన శుభయోగాలను తీసుకురానున్నాయి. ఈ యోగాల ప్రభావంతో ఆర్థికంగా, వృత్తి పరంగా, కుటుంబ జీవితంలోనూ మంచి మార్పులు కలగవచ్చని విశ్వసిస్తున్నారు. ఈ పుణ్యదినం ప్రభావంతో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసివస్తుంది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Rajashekher G
|

Updated on: Mar 25, 2026 | 5:27 PM

Share
హిందూ ధర్మంలో శ్రీరామ నవమికి ఎంతో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంది. ఈ సంవత్సరం శ్రీరామ నవమి మార్చి 27న జరుపుకుంటారు. సంప్రదాయం ప్రకారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో అభిజిత్ లగ్నంలో శ్రీరాముడు, సీతమ్మవారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తారు. అనంతరం బెల్లం, పానకం వంటి నైవేద్యాలను భక్తులకు పంపిణీ చేస్తారు. ఇక ఈసారి శ్రీరామ నవమి శుక్రవారం రావడం విశేషం. అదే రోజున పారిజాత యోగం, త్రిగ్రహ యోగం ఏర్పడటం వల్ల ఇది అత్యంత అరుదైన సందర్భంగా జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ ప్రభావం ద్వాదశ రాశులపై ఉన్నప్పటికీ, కొన్ని రాశుల వారికి ప్రత్యేకంగా శుభఫలితాలు లభించనున్నాయి. ఆ రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
కన్య రాశి: ఈ రాశి వారికి శ్రీరామ నవమి తర్వాత చేపట్టే పనులన్నీ విజయవంతమవుతాయి. సమాజంలో గౌరవం, మర్యాద పెరుగుతుంది. రావని అనుకున్న డబ్బులు కూడా చేతికి వస్తాయి. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు లభిస్తాయి. వినోద కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

2 / 5

తుల రాశి: ఇన్నాళ్లు శని, రాహు ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొన్న వీరికి ఇప్పుడు శుభ సమయం ప్రారంభమవుతుంది. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రువులు సైతం మిత్రులుగా మారి సహకరిస్తారు. భార్యవైపు ఆస్తులు కలిసి వస్తాయి. వాహనం లేదా కొత్త ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి.

3 / 5

మకర రాశి: మార్చి 27 నుంచి ఈ రాశి వారికి గోల్డెన్ డేస్ ప్రారంభమవుతాయి. విదేశీ ప్రయాణాల ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. రాజకీయ రంగంలో రాణించే అవకాశాలు ఉన్నాయి. సోదరులతో సఖ్యత పెరిగి, ఆర్థిక లాభాలు పొందుతారు.

4 / 5
మీన రాశి: ఈ అరుదైన యోగం కారణంగా మీన రాశి వారికి చాలా కాలంగా ఎదురుచూస్తున్న మంచి వివాహ సంబంధం కుదురుతుంది. కోరుకున్న వ్యక్తితో వివాహం జరగవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల్లో విజయాలు సాధిస్తారు. భూమి సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక సమస్యలు తొలగి, జీవితంలో పురోగతి సాధిస్తారు. ఈ విధంగా, ఈసారి శ్రీరామ నవమి కొన్ని రాశుల వారికి విశేషమైన శుభఫలితాలను అందించనుందని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తోంది.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

మీన రాశి: ఈ అరుదైన యోగం కారణంగా మీన రాశి వారికి చాలా కాలంగా ఎదురుచూస్తున్న మంచి వివాహ సంబంధం కుదురుతుంది. కోరుకున్న వ్యక్తితో వివాహం జరగవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల్లో విజయాలు సాధిస్తారు. భూమి సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక సమస్యలు తొలగి, జీవితంలో పురోగతి సాధిస్తారు. ఈ విధంగా, ఈసారి శ్రీరామ నవమి కొన్ని రాశుల వారికి విశేషమైన శుభఫలితాలను అందించనుందని జ్యోతిష్య శాస్త్రం సూచిస్తోంది. (Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్యం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)

5 / 5
Follow Us