ఈ కొబ్బరి బోండం నీళ్లు తాగితే కొన్ని గంటల్లోనే మరణం తధ్యం

25 March 2026

TV9 Telugu

TV9 Telugu

కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మేలని అందరికీ తెలిసిందే. ఎవరికైనా చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా కొబ్బరి నీళ్లు తాగమని వైద్యులు సైతం సలహా ఇస్తుంటారు. రోగాలతో ఉన్నవాళ్లకే కాదు ఆరోగ్యంగా ఉన్నవాళ్లకూ ఇందులో ఉండే పోషకాలు అవసరమే

TV9 Telugu

అయితే, అధికంగా పోషకాలు ఉండే కొబ్బరి నీళ్లు ఒక్కోసారి ప్రాణాలను కూడా తీస్తాయ్. అయితే పరిమితిని మించితే ఔషధం కూడా వికటిస్తుంది. ఎక్కువ మోతాదులో లవణాలు ఉండే కొబ్బరి నీళ్లను పరిమితంగా తాగడమే మేలని చెబుతున్నారు నిపుణులు

TV9 Telugu

కొందరైతే.. కొబ్బరినీళ్లు లీటర్‌ బాటిల్‌ కొని గటగటా తాగేస్తుంటారు. ఇంకొందరు రెండుసార్లు విరామం ఇస్తూ లీటర్‌ పట్టిస్తారు. అయితే దీనితోపాటు కొన్నిరకాల కొబ్బరి బోండాల్లోని నీళ్లు గుక్కెడు తాగినా ప్రాణాలు పోతాయి

TV9 Telugu

అవును.. ఆరోగ్యానికి మేలు చేసే కొబ్బరి నీళ్లు కొన్నిసార్లు కీడునూ తలపెడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. 2021లో డెన్మార్క్‌కు చెందిన 69 ఏళ్ల వ్యక్తి పైకి తాజాగా కనిపించే ఓ కొబ్బరి బోండాం నీళ్లు తాగాడు

TV9 Telugu

అంతే అప్పటిదాకా ఆరోగ్యకరంగా కనిపించిన వ్యక్తి కొద్ది నిమిషాల్లోనే తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యాడు. అందుకు కారణం అతడు తాగిన కొబ్బరి నీళ్లలో 3-నైట్రోప్రొపియోనిక్‌ యాసిడ్‌ అనే ప్రాణాంతక టాక్సిన్‌ ఉండటమే

TV9 Telugu

దీని ప్రభావంతో అతడికి కొద్ది గంటల్లోనే వికారం, వాంతులతో పాటు శరీరమంతా చెమటలు పట్టడం మొదలయ్యాయి. ఆ తర్వాత మల్టీ ఆర్గాన్స్‌ పాడైపోయి చివరకు ప్రాణాలే కోల్పోయాడు

TV9 Telugu

కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్‌, విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అయితే అన్ని కొబ్బరి బోండాలూ సురక్షితం కాదని గుర్తించాలి. వెచ్చదనం, తేమతో కూడిన ప్రదేశాల్లో కొబ్బరిబొండాలను నిల్వ చేయకూడదు

TV9 Telugu

ఇలాంటి చోట నిల్వ చేస్తే టెంకపై ఉండే చిన్న పగుళ్లద్వారా శిలీంద్రాలు కాయలోకి చొచ్చుకుపోతాయి. దీంతో పైకి మాత్రం బోండం తాజాగానే ఉన్నా లోపల మాత్రం విషపదార్థాలు ఉత్పత్తవుతాయి. ఇలాంటి బోండాల్లోని నీళ్లు తాగితే మన నాడీ వ్యవస్థ, మెదడు వంటి ముఖ్య అవయవాలను తీవ్రంగా దెబ్బతీస్తాయి