మల్కాజ్గిరిలో పదో తరగతి కూడా పాస్ కానీ రమేష్ అనే వ్యక్తి నకిలీ బీడీఎస్ సర్టిఫికెట్లతో 20 ఏళ్లుగా దంత వైద్యుడిగా చలామణి అవుతున్న ఉదంతం వెలుగు చూసింది. నేరేడ్మెట్లో క్లినిక్ ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అతడిని ఎస్వోటీ పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.