AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రతి చపాతీ దూదిలా మెత్తగా, బెలూన్‌లా పొంగాలా..? అయితే ఈ చిట్కాలు మీ కోసమే!

చపాతీలు చేయడం అందరికీ వచ్చు. కానీ, అవి హోటల్ స్టైల్‌లో మెత్తగా, పొరలు పొరలుగా రావడం ఒక కళ. చపాతీలు వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉండి, కాసేపటికే గట్టిగా మారిపోవడం చాలామంది ఎదుర్కొనే సమస్య. కానీ, ప్రతి చపాతీ దూదిలా మెత్తగా, బెలూన్‌లా పొంగాలంటే పిండి కలిపే విధానంలోనే ఉంది అసలు రహస్యం. ఇంట్లో చేసే చపాతీలు గట్టిగా వస్తున్నాయని బాధపడుతున్నారా? అయితే ఈ క్రింది చిట్కాలను ఒకసారి ప్రయత్నించి చూడండి. ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చపాతీలు ఎక్కువ సేపు మెత్తగా ఉండటమే కాకుండా, ప్రతిదీ చక్కగా పొంగుతుంది.

ప్రతి చపాతీ దూదిలా మెత్తగా, బెలూన్‌లా పొంగాలా..? అయితే ఈ చిట్కాలు మీ కోసమే!
Hotel Style Chapati Tips
Jyothi Gadda
|

Updated on: Mar 25, 2026 | 6:14 PM

Share

వంటగదిలో అత్యంత సంతృప్తి ఏమిటంటే, పెనం మీద పెట్టిన రొట్టె బెలూన్‌లా ఉబ్బడం. అయితే, మనం పిండి కలిపేప్పటి నుండి పెనం మీద కాల్చే వరకు మధ్యలో ఎక్కడో ఒక చిన్న పొరపాటు చేస్తుంటాము. దాని ఫలితంగా మనం చేసిన రోటీ, చపాతీలు పాపడ్ లాగా గట్టిగా అయిపోవడం లేదా అస్సలు పొంగక పోవడం జరుగుతుంది. అలాంటి చిన్న పొరపాట్లు చపాతీలను పాడుచేస్తాయి. దీనివల్ల అవి సరిగ్గా పొంగకుండా, తక్కువ సమయంలోనే గట్టిపడిపోతాయి. అందువల్ల, మధ్యాహ్న భోజనం కోసం చపాతీలు చేసేటప్పుడు అవి బూరెల్లా పొంగి, మల్లెపూల కంటే మెత్తగా ఉండటం చాలా ముఖ్యం. అదేలాగో ఇక్కడ చూద్దాం..

పిండిని తడిపే విధానంలో పాటించాల్సిన చిట్కాలు:

పిండిని మామూలు నీటితో కాకుండా గోరువెచ్చని నీటితో కలపండి. ఇది పిండిలోని గ్లూటెన్‌ను యాక్టివేట్ చేసి చపాతీలు మెత్తగా రావడానికి సహాయపడుతుంది. మరింత మెత్తదనం కోసం నీటికి బదులు పాలను కూడా వాడవచ్చు. పిండి కలిపేటప్పుడు ఒక టీస్పూన్ నూనె లేదా నెయ్యి వేయండి. ఇది చపాతీలకు మంచి మృదుత్వాన్ని ఇస్తుంది. పిండిని కనీసం 5-7 నిమిషాల పాటు బాగా ఒత్తడం (Kneading) చాలా ముఖ్యం. ఇక పిండి కలిపిన వెంటనే చపాతీలు చేయకండి. పిండిపై కొంచెం నూనె రాసి, తడి గుడ్డతో కప్పి కనీసం 20 నిమిషాల పాటు పక్కన పెట్టండి. దీనివల్ల పిండి సాగే గుణాన్ని పొందుతుంది.

ఇవి కూడా చదవండి

ఇక ఇప్పుడు చపాతీని ఒత్తేటప్పుడు అన్ని వైపులా సమానంగా ఉండేలా చూసుకోండి. అంచులు లావుగా ఉంటే చపాతీ సరిగ్గా పొంగదు. అలాగే మరీ ఎక్కువ పొడి పిండిని వాడకండి, అది చపాతీని త్వరగా గట్టిపరుస్తుంది. తరువాత చపాతీ వేయడానికి ముందే పెనం బాగా వేడెక్కాలి. తక్కువ వేడి ఉన్న పెనంపై వేస్తే చపాతీ గట్టిగా మారుతుంది. మీడియం నుండి హై ఫ్లేమ్ మీద కాల్చడం ఉత్తమం. చపాతీని పెనంపై వేసిన తర్వాత చిన్న బుడగలు రాగానే రెండో వైపుకు తిప్పాలి. ఒకే వైపు ఎక్కువ సేపు ఉంచితే అది మాడిపోవడమే కాకుండా గట్టిగా అవుతుంది.

ఇలా కాల్చిన చపాతీలను వెంటనే ఒక కాటన్ గుడ్డలో చుట్టి హాట్ బాక్స్‌లో ఉంచండి. దీనివల్ల వేడికి వచ్చే ఆవిరి చపాతీలను మరింత మెత్తగా ఉంచుతుంది. ఈ చిట్కాలు పాటిస్తే మీ ఇంట్లో ప్రతిరోజూ దూదిలాంటి మెత్తటి చపాతీలను ఆస్వాదించవచ్చు!

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us