Tollywood : హీరోయిన్ శ్రీవిద్య చనిపోవడానికి కారణం అదే.. ఆస్తులు పోగొట్టుకుని.. భర్త మోసం.. టాలీవుడ్ నటి ఎమోషనల్..
సీనియర్ నటి పీఆర్ వరలక్ష్మి, ప్రముఖ నటి శ్రీవిద్య జీవితంలోని కష్టాలు, ఆమె ఎదుర్కొన్న ఆర్థిక సవాళ్లు, అలాగే పరిశ్రమలోని మహిళా కళాకారుల త్యాగాల గురించి భావోద్వేగంగా మాట్లాడారు. నటీమణులు తమ వ్యక్తిగత జీవితాలను త్యాగం చేస్తారని, కొన్నిసార్లు ఆర్థికంగా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటారని ఆమె పేర్కొన్నారు. వరలక్ష్మి తనతో పాటు పనిచేసిన నటి మనోరమ ఇచ్చిన ఆర్థిక సలహాను గుర్తుచేసుకున్నారు. ఖాళీగా ఉన్నప్పుడు పని చేయి, బిజీగా ఉన్నప్పుడు డిమాండ్ చేయి అని మనోరమ చెప్పిన మాటలు తనకు ఇప్పటికీ గుర్తు ఉన్నాయని తెలిపారు. శ్రీవిద్య ఎంత అందగత్తె, మంచి సింగర్, ఆర్టిస్ట్ అయినప్పటికీ, ఆమె జీవితంలో మోసాలకు గురయ్యారని, ఆర్థికంగా పూర్తిగా కోల్పోయారని వరలక్ష్మి వివరించారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
