AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bike Mileage: బైక్ మైలేజ్ ఇవ్వట్లేదా.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఈజీగా పెంచుకోండి..

భారతదేశంలో మధ్యతరగతి ప్రజలకు బైక్ అనేది ఒక నిత్యావసర వస్తువు. హీరో మోటోకార్ప్ నుండి బజాజ్ వరకు ఎన్నో కంపెనీలు అధిక మైలేజీని ఇచ్చే బైక్‌లను మార్కెట్లోకి తెచ్చినప్పటికీ, చాలామంది వినియోగదారులు తమ బైక్ ఆశించిన స్థాయిలో మైలేజ్ ఇవ్వడం లేదని ఆందోళన చెందుతుంటారు. అయితే బైక్ మైలేజ్ అనేది కేవలం ఇంజిన్ మీద మాత్రమే కాదు, మనం దాన్ని నిర్వహించే తీరుపై కూడా ఆధారపడి ఉంటుంది. మీ బైక్ మైలేజీని పెంచుకోవడానికి నిపుణులు సూచిస్తున్న చిట్కాలు గురించి తెలుసుకుందాం..

Krishna S
|

Updated on: Mar 25, 2026 | 6:19 PM

Share
సకాలంలో సర్వీసింగ్: బైక్ ఇంజిన్, ఇతర భాగాలు సజావుగా పనిచేయాలంటే క్రమబద్ధమైన సర్వీసింగ్ తప్పనిసరి. ఇంజిన్ లోపల ఘర్షణ తగ్గితేనే ఇంధనం తక్కువగా ఖర్చవుతుంది. ఖర్చు తగ్గించుకోవడానికి తక్కువ ధర కలిగిన లేదా నాణ్యత లేని ఆయిల్‌ను వాడకండి. కంపెనీ సూచించిన గ్రేడ్ ఉన్న ఆయిల్‌ను వాడటం వల్ల ఇంజిన్ స్మూత్‌గా నడవడమే కాకుండా మైలేజ్ కూడా పెరుగుతుంది.

1 / 5
టైర్ల ఆరోగ్యం: అరిగిపోయిన టైర్లు రోడ్డుపై పట్టు కోల్పోతాయి. దీనివల్ల ఇంజిన్‌పై భారం పడుతుంది. టైర్లను క్రమం తప్పకుండా తనిఖీ చేసి, అవసరమైతే కొత్తవి మార్చడం వల్ల భద్రతతో పాటు మైలేజ్ కూడా లభిస్తుంది. టైర్లలో గాలి తక్కువగా ఉంటే రోడ్డుకు, టైరుకు మధ్య ఘర్షణ పెరిగి మైలేజ్ పడిపోతుంది. తయారీదారు సూచించిన పరిమాణంలో గాలి ఉండేలా చూసుకోవడం వల్ల ఇంధనం ఆదా అవుతుంది.

2 / 5
బ్రేకుల వినియోగం: అనవసరంగా పదేపదే బ్రేకులు వేయడం, క్లచ్‌ను సగం నొక్కి పట్టుకోవడం వంటివి చేయకూడదు. ఇలా చేయడం వల్ల ఇంజిన్ ఎక్కువ శక్తిని వెచ్చించాల్సి వస్తుంది, ఇది మైలేజీని నేరుగా దెబ్బతీస్తుంది. బైక్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. ముఖ్యంగా ఎయిర్ ఫిల్టర్‌లో దుమ్ము పేరుకుపోతే ఇంజిన్‌కు గాలి అందక మైలేజ్ తగ్గుతుంది. ఎయిర్ ఫిల్టర్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలి.

3 / 5
ఎకానమీ వేగ పరిమితి: ప్రతి బైక్‌కు ఒక నిర్ణీత వేగ పరిమితి ఉంటుంది. ఈ పరిధిలో ప్రయాణించడం వల్ల ఇంజిన్ గరిష్ట సామర్థ్యంతో పని చేస్తుంది. వేగానికి తగినట్లుగా గేర్లను మార్చాలి. తక్కువ వేగంతో ఉన్నప్పుడు టాప్ గేర్‌లో వెళ్లడం లేదా ఎక్కువ వేగంతో ఉన్నప్పుడు లో-గేర్‌లో వెళ్లడం వల్ల ఇంజిన్‌పై ఒత్తిడి పడి ఇంధనం వృథా అవుతుంది.

4 / 5
చైన్ సెట్, స్పార్క్ ప్లగ్ వంటి భాగాలను క్రమం తప్పకుండా తనిఖీ చేయండి. పాడైన భాగాలను సకాలంలో మార్చడం వల్ల బైక్ పనితీరు మెరుగుపడుతుంది. బైక్ స్టార్ట్ చేసిన వెంటనే అమాంతం యాక్సిలరేటర్ ఇవ్వకండి. ప్రశాంతంగా, పొదుపైన వేగంతో నడపడం అలవాటు చేసుకోండి. సిగ్నల్స్ వద్ద ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తే ఇంజిన్ ఆఫ్ చేయడం ఉత్తమం.

5 / 5
Follow Us