17 ఏళ్లకే తోపు హీరోయిన్.. 23 ఏళ్లకే వ్యభిచారం కేసులో అరెస్ట్..

Rajitha Chanti

Pic credit - Instagram

25 March 2026

సినీరంగుల ప్రపంచంలో ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. కానీ ఊహించని విధంగా ఆమె కెరీర్ చిక్కు్ల్లో పడింది.

17 ఏళ్ల వయసులోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె తోపు హీరోయిన్. అప్పట్లో కుర్రాళ్ల కలల రాకుమారి. కానీ 23 ఏళ్ల వయసులో అనుహ్యంగా వ్యభిచారం కేసులో చిక్కుకుని అరెస్ట్ అయ్యింది ఈ భామ. 

ఆమె మరెవరో కాదు హీరోయిన్ శ్వేత బసు ప్రసాద్. కొత్త బంగారు లోకం సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే.

2008లో వచ్చిన కొత్త బంగారు లోకం సినిమాతో తెలుగు సినీరంగంలో ఆమె తిరుగులేని స్టార్ డమ్ సంపాదించుకుంది. ఇందులో ఆమె యాక్టింగ్, క్యూట్ ఎక్స్‌ప్రేషన్స్ చూసి ఫిదా అయ్యారు కుర్రాళ్లు.

ఈ సినిమా తర్వాత ఆమె క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోతుందని అనుకున్నారు. తెలుగులో వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ అవుతుందనుకున్నారు. కానీ ఆమెకు ఊహించిన స్థాయిలో ఆఫర్స్ రాలేదు.

కొత్త బంగారు లోకం తర్వాత రైడ్, కాస్కో, కళవర్ కింగ్ వంటి చిన్న చిన్న సినిమాలు చేసింది. అవి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవడంతో ఆఫర్స్ కరువయ్యాయి. అదే టైంలో ఒక తప్పు ఆమె కెరీర్ నాశనం చేసింది.

2014లో హైదరాబాద్ లోని ఓ 5 స్టార్ హోటల్లో వ్యభిచారం కేసులో అరెస్ట్ అయ్యింది. ఈ ఘటన యావత్ సినీ ప్రపంచాన్ని షాక్ కు గురి చేసింది. ఆ తర్వాత ఆమె పై క్లీన్ చిట్ ఇచ్చారు పోలీసులు.

సినీ నిర్మాత రోహిత్ మిట్టల్ ను పెళ్లి చేసుకున్న శ్వేత బసు ప్రసాద్ 9 నెలలకే అతడితో విడాకులు తీసుకుంది. కొన్నాళ్లు సైలెంట్ అయిన ఆమె ఇప్పుడు ఓటీటీలో వరుస వెబ్ సిరీస్, సినిమాలు చేస్తుంది.