AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gas Shortage: హోటల్స్, రెస్టారెంట్లకు వెళుతున్నారా..? కేంద్రం నుంచి భారీ ఊరట.. డబ్బులు ఆదా అయినట్లే..

కేంద్రం కీలక ప్రకటన చేసింది. గ్యాస్ కొరత క్రమంలో హోటళ్లు, రెస్టారెంట్లు మెనూలో ధరలను పెంచేశాయి. అంతేకాకుండా గ్యాస్ బిల్లు పేరుతో ప్రత్యేక ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. అదనపు ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Gas Shortage: హోటల్స్, రెస్టారెంట్లకు వెళుతున్నారా..? కేంద్రం నుంచి భారీ ఊరట.. డబ్బులు ఆదా అయినట్లే..
Money
Venkatrao Lella
|

Updated on: Mar 25, 2026 | 9:00 PM

Share

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు, ఇతర ఆహార పదార్ధాల షాపులు రేట్లను పెంచుతున్నాయి. ఆహార పదార్థాల ధరలు ఒకేసారి భారీగా పెంచాయి. గ్యాస్ ధరలు పెరగడం, సిలిండర్ల కొరత వేళ ధరలను భారీగా పెంచాయి. ఇక గ్యాస్ బిల్లు పేరుతో అదనంగా ఛార్జీలు వసూలు చేస్తున్న బిల్లు ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. గ్యాస్ కొరతను బూచిగా చూపించి అదనపు ఛార్జీలను నిర్వహకులు వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. కస్టమర్ల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఎల్పీజీ ఛార్జీలు, ఇంధన వ్యయం పేరుతో అదనపు రసుంలు వసూలు చేయవద్దని కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ స్పష్టం చేసింది.

మెనూలోని ధరలే ఫైనల్

హోటళ్ల నిర్వాహకులు అదనపు ఛార్జీలు వసూలు చేస్తుండటంపై జాతీయ వినియోగదారుల హెల్ప్ లైన్ నెంబర్‌కు కాల్స్ వస్తున్నాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా ఫొటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో కేంద్రం స్పందించింది. మెనూలో పేర్కొన్న ధరల కంటే అదనపుంగా వసూలు చేయవద్దని, వినియోగదారులను ఇబ్బంది పెట్టవద్దని సూచించింది. వినియోగదారుల చట్టం రూల్స్‌ను పాటించాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. వినియోగదారుల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపింది.

50 శాతం పెరిగిన వాణిజ్య సిలిండర్ సరఫరా

వాణిజ్య సిలిండర్ల సరఫరా 50 శాతం పెరిగినట్లు కేంద్రం బుధవారం ప్రకటించింది. వాణిజ్య సిలిండర్లను సరఫరా పెరిగిందని, గ్యాస్ కొరత లేదని చెబుతోంది. త్వరలో పూర్తి స్థాయిలో వాణిజ్య సిలిండర్ల సరఫరా యథాతధంగా జరుగుతుందని స్పష్టం చేసింది. ప్రజలు భయాందోళనకు గురి కావొద్దని సూచించింది. హర్ముజ్ జలసంధి భారత్‌కు ఇరాన్ తెరిసింది. భారత నౌకలను అనుమతిస్తోంది. దీని వల్ల గ్యాస్‌తో కూడిన నౌకలు భారత్‌కు వస్తున్నాయి.

Follow Us