AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: ఏపీ సర్కార్ సరికొత్త పాలసీ.. ఇకపై వాట్సప్‌లో నిమిషాల్లోనే ఆ కార్డులు జారీ..

వయోవృద్ధుల చెంతకే ప్రభుత్వ సేవలు.. ఏపీలో వృద్ధుల భద్రత, ఆరోగ్యం, గౌరవం కోసం కూటమి ప్రభుత్వం సరికొత్త సంస్కరణలు చేపట్టింది. ఇకపై కేవలం ఒక్క వాట్సాప్ మెసేజ్‌తో సీనియర్ సిటిజన్ కార్డులు పొందేలా మన మిత్ర సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో రాయితీల నుంచి వృద్ధాశ్రమాల్లో వ్యాయామ పరికరాల వరకు.. వృద్ధులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి తెలుసుకుందాం..

Andhra Pradesh: ఏపీ సర్కార్ సరికొత్త పాలసీ.. ఇకపై వాట్సప్‌లో నిమిషాల్లోనే ఆ కార్డులు జారీ..
Free Senior Citizen Cards Via Whatsapp
Eswar Chennupalli
| Edited By: |

Updated on: Mar 25, 2026 | 9:43 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధాప్య శాతాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. అందుకోసమే పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీకి శ్రీకారం చుట్టింది. జనాభా నియంత్రణ కోసం గతంలో తయారు చేసిన చట్టాలన్నింటిని రద్దు చేసింది. కొత్తగా జనాభాను ప్రోత్సహించేందుకు చట్టాలు చేయబోతోంది. వీటికి తోడు సీనియర్ సిటిజన్ల అవసరాలకు అనుగుణంగా పలు నిర్ణయాలని తాజాగా తీసుకుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. వాట్సప్ మన మిత్ర ద్వారా ఉచితంగా సీనియర్ సిటిజన్ కార్డులు జారీ చేస్తోంది. సైబర్ నేరాల పట్ల వృద్ధులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ, సీట్ల కేటాయింపు పటిష్టంగా అమలు చేయాలనీ ఆదేశించింది.

మన మిత్ర వాట్సప్ ద్వారా..

మన మిత్ర వాట్సాప్ ద్వారా రాష్ట్రంలోని వయో వృద్ధులకు ఉచితంగా సీనియర్ సిటిజన్ కార్డులు అందిస్తున్నామని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి తెలిపారు. సచివాలయంలో మంత్రి స్వామి అధ్యక్షతన సీనియర్ సిటిజన్స్ రాష్ట్ర కౌన్సిల్ 3వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వయోవృద్ధుల సంక్షేమం, ఆరోగ్యం, భద్రతపై సమావేశంలో మంత్రి సమీక్షించారు. మన మిత్ర వాట్సాప్ ద్వారా అర్హులైన వారందరికీ సీనియర్ సిటిజన్ కార్డులు తీసుకునేలా అవగాహన కల్పించాలని నిర్ణయించింది. సైబర్ నేరాల పట్ల వృద్ధులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని, వృద్ధాశ్రమాల్లో లైట్ వెయిట్ వ్యాయామ పరికరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

RTC బస్సులలో రాయితీ..

ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ, సీట్ల కేటాయింపు పటిష్టంగా అమలు చేయాలి. వృద్ధులు, దివ్యాంగుల కోసం కలెక్టర్ కార్యాలయాల్లో లిఫ్ట్ సౌకర్యంతో పాటు వీల్ చైర్లు ఏర్పాటు చేస్తోంది ఏపీ ప్రభుత్వం. వృద్ధులు, దివ్యాంగులకు దేశంలో ఎక్కడా లేనివిధంగా పెద్ద మొత్తంలో పింఛన్లు ఇస్తోంది. 2036 నాటికి రాష్ట్రంలో ప్రతి 5 మందిలో ఒకరు వృద్ధుడు ఉంటారు. దీన్ని అధిగమించేందుకే సీఎం చంద్రబాబు పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీకి శ్రీకారం చుట్టారు. ప్రోత్సాహకలతో కూడిన పాలసీలో అనేక బెనిఫిట్స్ ఉంటాయని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి తెలిపారు.

Follow Us