AP Polycet 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. ఈ సర్టిఫికెట్లు వెంటనే సిద్ధం చేసుకోండి
రాష్ట్రంలో 2026-27 విద్యాసంవత్సరానికి ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల ప్రవేశాల కోసం తొలి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. జూన్ 24 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్ల నమోదు, సీట్ల కేటాయింపు, కాలేజీల్లో రిపోర్టింగ్‌కు సంబంధించిన పూర్తి తేదీలను ఈ కింద చెక్ చేసుకోండి..

అమరావతి, జూన్ 22: ఆంధ్రప్రదేశ్ పాలీటెక్నిక్ డిపొమా కోర్సు్ల్లో 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్ పాలీటెక్నికల్ కాలేజీల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. డిప్లొమా ప్రవేశాలకు తొలి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 24 నుంచి మొదలవనుంది. ఇది జులై 4 వరకు కొనసాగుతుంది. అర్హత పొందిన అభ్యర్థులు కాలేజీలు, బ్రాంచీలను ఎంపిక చేసుకోవాలని అధికారులు సూచించారు.
కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూల్ ఇదే..
- మొదటి విడత కౌన్సెలింగ్‌లో ఆన్‌లైన్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీలు: జూన్ 24 నుంచి జూన్ 30 వరకు.
- హెల్ప్‌లైన్ సెంటర్లలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ మార్పులు, సవరణ తేదీలు: జూన్ 25 జులై 1 వరకు
- వెబ్ ఆప్షన్ల నమోదు: జూన్ 29 నుంచి జులై 3
- వెబ్ ఆప్షన్లలో మార్పులు: జులై 4
- సీట్ల కేటాయింపు: జులై 6న సాయంత్రం 6 గంటలకు సీట్ల కేటాయింపు ఫలితాలు
- సెల్ఫ్ రిపోర్టింగ్, కాలేజీలో రిపోర్టింగ్: జులై 7 నుంచి జులై 10 వరకు
- తరగతులు ప్రారంభం: జులై 7 నుంచి
వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనే అభ్యర్థులు ఈ కింది ధ్రువపత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి.
కౌన్సెలింగ్‌కు అవసరమైన సర్టిఫికెట్లు ఇవే..
- ఏపీ పాలీసెట్ 2026 హాల్‌టికెట్
- ఏపీ పాలీసెట్2026 ర్యాంక్ కార్డు
- అభ్యర్థి ఆధార్ కార్డు
- టెన్త్ మార్కుల మెమో
- 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు
- రెసిడెన్స్ సర్టిఫికెట్
- నాన్-లోకల్ అభ్యర్థులకు నివాస ధ్రువపత్రం
- ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ (అవసరమైతే)
- ఇన్‌కమ్ సర్టిఫికెట్
- SC/ST/BC అభ్యర్థులకు కుల సర్టిఫికెట్
- మైనారిటీ సర్టిఫికెట్
- టీసీ సర్టిఫికెట్
వంటి అవసరమైన సర్టిఫికెట్లు కౌన్సెలింగ్‌లో సమర్పించాల్సి ఉంటుంది. కౌన్సెలింగ్ ప్రక్రియలో ఏదైనా సాంకేతిక ఇబ్బందులు ఎదురైతే chepolycet@gmail.com ఈమెయిల్ ఐడీ ద్వారా లేదా 7842075469, 7842085469, 7842095469 హెల్ప్ లైన్ నంబర్లను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు సంప్రదించవచ్చు.




