AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డబ్బు కోసమే అతను నన్ను వాడుకున్నాడు.. ఎమోషనల్ అయిన బిగ్ బాస్ భామ

బిగ్ బాస్ కంటెస్టెంట్, నటి తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. గతంలో ఒక వ్యక్తితో తనకున్న ప్రేమ సంబంధం గురించి మాట్లాడుతూ, ఆ వ్యక్తి తనను డబ్బుల కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం వాడుకున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

డబ్బు కోసమే అతను నన్ను వాడుకున్నాడు.. ఎమోషనల్ అయిన బిగ్ బాస్ భామ
Actress
Rajeev Rayala
|

Updated on: Jun 22, 2026 | 1:47 PM

Share

అందాల భామ ఇనయా సుల్తానా.. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ అమ్మడు బిగ్ బాస్ కంటెస్టెంట్, త్రీ రోజెస్ సిరీస్‌లో తన నటనతో గుర్తింపు తెచ్చుకుంది. కాగా ఈ ముద్దుగుమ్మ ఇటీవల తన జీవితంలో జరిగిన ఓ సంఘటనను పంచుకుంది. తన వ్యక్తిగత జీవితంలో ఎదురైన సవాళ్ల గురించి ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. గతంలో ఒక వ్యక్తితో తనకున్న సంబంధం గురించి మాట్లాడుతూ, తనను డబ్బుల కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం ఉపయోగించుకున్నాడని ఇనయా సుల్తానా సంచలన విషయాలు బయటపెట్టింది. గతంలో తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి రొమాంటిక్ ఫోటోలు సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ సమయంలో ఎందుకు అలా బోల్డ్‌గా ఫోటోలు తీసుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు.. తాను ఆ సంబంధాన్ని పూర్తి స్థాయిలో నమ్మానని, పెళ్లి చేసుకుని, పిల్లలతో జీవితాంతం అతనితోనే గడపాలని కలలు కన్నానని ఇనయా సుల్తానా తెలిపింది.

ఇది కూడా చదవండి : ఇలాంటి హీరోను ఇన్నాళ్లు ఎందుకు మిస్ అయ్యానా అని ఫీల్ అయ్యా.. ఆయనతో మళ్లీ మళ్లీ సినిమా చేయాలనుంది

అందుకే అంత ధైర్యంగా తన భాగస్వామిని ప్రపంచానికి చూపించాలనుకున్నానని తెలిపింది. అయితే, అది కేవలం తొమ్మిది నెలల్లోనే బట్టబయలైన పెద్ద నమ్మకద్రోహమని ఆమె చెప్పుకొచ్చింది. తాను సర్వం ఇచ్చినప్పటికీ, అవతలి వ్యక్తి తనను కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసం, అంటే పేరు, డబ్బు కోసం ఉపయోగించుకున్నాడని ఇనయా సుల్తానా స్పష్టం చేసింది. ఈ మోసం వల్ల తాను ఆర్థికంగా కూడా నష్టపోయానాని, ఒక వ్యాపారం ప్రారంభించడం కోసం తన నాలుగు గాజులు అమ్మి డబ్బులు ఇచ్చానని, ఆ వ్యాపారం సదరు వ్యక్తి వలనే ఆగిపోయిందని, తాను పెట్టుబడి పెట్టిన డబ్బులు, గాజులు కూడా తిరిగి రాలేదని తెలిపింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : అప్పుడు నాతో కలిసి హోటల్‌లో పని చేశాడు.. ఇప్పుడు పెద్దస్టార్ అయ్యాడు.. కలిస్తే ఎలా ఉంటాడంటే

బ్రేకప్ సమయంలో ఆ వ్యక్తిని తిరిగి తన జీవితంలో కనిపించకుండా ఉండటానికి ఎంత డబ్బు కావాలో చెప్పమని అడిగానని ఇనయా సుల్తానా తెలిపింది. నెలకు కొంత మొత్తం పంపిస్తానని, తన మొహం చూపించొద్దని చెప్పినట్లు ఆమె ఎమోష్నలైంది. ఈ సంఘటనలన్నీ తన జీవితానికి ఎన్నో పాఠాలు నేర్పాయని, తనను మరింత బలంగా మార్చాయని ఇనయా సుల్తానా చెప్పుకొచ్చింది. చిన్నతనం నుంచి తల్లిదండ్రుల నుంచి ప్రేమ దొరకనప్పుడు, ఎవరైనా కొంచెం ఆప్యాయత చూపించినా త్వరగా అటాచ్ అవుతారని, అలాంటి బలహీనతే తనకు అప్పుడప్పుడు ఎదురైందని తెలిపింది ఇనయా సుల్తానా.

ఇది కూడా చదవండి :Anupama Parameswaran: ఓటీటీలోకి వచ్చేసిన అనుపమ పరమేశ్వరన్ లేటెస్ట్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us