ఎగ్ బిర్యానీ ఇలా చేస్తే.. ప్లేట్లు ఖాళీ అవ్వాల్సిందే!

Prasanna Yadla

25 March 2026

Pic credit - Pixabay

ఎగ్ బిర్యానీ ఇలా చేస్తే కమ్మగా ఉంటుంది. మరి, ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం.. 

ఎగ్ బిర్యానీ

ముందుగా ఒక కప్పు బియ్యాన్ని తీసుకుని వాటిని బాగా కడిగి నానబెట్టాలి.

స్టెప్ - 1

ఆ తర్వాత నాలుగు కోడి గుడ్లను తీసుకుని బాగా ఉడికించి నాలుగు ముక్కలు చేసుకోవాలి. 

స్టెప్ - 2

ఇప్పుడు పొయ్యి మీద పెట్టి కొద్దిగా నూనె లేదా నెయ్యి  చేసి దానిలో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు గోల్డ్ రంగులోకి మారే వరకు వాటిని బాగా వేయించాలి.

స్టెప్ - 3

ఇక ఇప్పుడు ఒక టేబుల్ అల్లం–వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేయించాలి.

స్టెప్ - 4

ఆ తర్వాత కట్ చేసిన టమాటా ముక్కలు, అర టీ స్పూన్ పసుపు, కారం,  మసాలా పొడులు వేయాలి. 

స్టెప్ - 5

ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుడ్లను కూడా  వేసి వాటిలో బాగా  వేయించాలి.ఇక ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బియ్యం, రెండు గ్లాస్ ల నీళ్లు,  రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి.

స్టెప్ - 6

చివర్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలిపితే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే వేడి వేడి ఎగ్ బిర్యానీ రెడీ.

అంతే వేడి వేడి ఎగ్ బిర్యానీ రెడీ.