AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGSRTC: శ్రీరామనవమి సందర్భంగా ఇంటి వద్దకే భద్రాచలం స్వామివారి కళ్యాణ తలంబ్రాలు.. జస్ట్ ఒక్క దూరంలో..

ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ కీలక సూచనలు జారీ చేసింది. శ్రీరామనమి సందర్భంగా అద్బుత అవకాశం కల్పిస్తోంది. భద్రాచలం స్వామివారి కళ్యాణ్ తలంబ్రాలు ఇంటి వద్ద ఉండే పొందచ్చు. ఆర్డర్ చేసుకుంటే ఇంటికే ఆర్టీసీ డోర్ డెలివరీ చేసేలా లాజిస్టిక్స్ సేవలను ప్రారంభించినట్లు తెలిపింది.

TGSRTC: శ్రీరామనవమి సందర్భంగా ఇంటి వద్దకే భద్రాచలం స్వామివారి కళ్యాణ తలంబ్రాలు.. జస్ట్ ఒక్క దూరంలో..
Tsrtc
Venkatrao Lella
|

Updated on: Mar 25, 2026 | 7:13 PM

Share

శ్రీరామనవమి వస్తున్న క్రమంలో ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ శుభవార్త అందించింది. ఈ పండుగ సందర్భంగా భద్రచాలం ఎక్కుమంది వెళ్తుంటారు. స్వామివారి కళ్యాణాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు వేలాదిమంది భక్తులు ప్రతీ ఏడాది భద్రాచలం వెళుతుంటారు. ఇలాంటివారికి టీజీఎస్‌ఆర్టీసీ తాజాగా తీపికబురు అందించింది. భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఇప్పటినుంచే సీట్లు బుక్ చేసుకోవాలని ఆర్టీసీ సూచించింది. ఈ మేరకు ఎక్స్‌లో ఓ ప్రకటన జారీ చేసింది. www.tgsrtc.inను సందర్శించి టికెట్లను బుక్ చేసుకోవాలని సూచించింది.

ఇంటికే తలంబ్రాలు

ఇక భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ తలంబ్రాలను భక్తులకు ఇంటి వద్దకే అందించనుంది. భక్తులు ఆర్టీసీ ద్వారా ఆర్డర్ పెట్టుకుంటే ఇంటికే డోర్ డెలివరీ చేయనుంది. టీజీఎస్‌ఆర్టీసీ లాజిస్టిక్స్ సేవల ద్వారా ఈ సదుపాయం కల్పిస్తున్నామని, భక్తులు వినియోగించాలని అధికారులు స్పష్టం చేశారు. కేవలం రూ.151 చెల్లించి ఆర్డర్ పెట్టుకుంటే కళ్యాణ తలంబ్రాలను నేరుగా మీ ఇంటి వద్దకే తెచ్చి అందిస్తామని టీజీఎస్ఆర్టీసీ తన ప్రకటనలో స్పష్టం చేసింది.

ఈ బస్సుల్లో 30 శాతం రాయితీ

ఇక వేసవి రావడంతో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రయాణాల్లో ఇబ్బంది పడేవారికి ఆర్టీసీ మంచి అవకాశం కల్పిస్తోంది. హైదదరాబాద్‌లోని ఏసీ బస్సుల్లో టికెట్ల రేట్లను తగ్గించింది. ఏసీ బస్సుల్లో 30 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు తెలిపింది. మెట్రో ఏసీ, డీలక్స్, ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో టికెట్‌పై 30 శాతం డిస్కౌంట్ ఇవ్వనుంది. ఎండల దృష్ట్యా చాలామంది ఏసీ బస్సుల్లో ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఏసీ బస్సులకు ఫుల్ గిరాకీ పెరగనుంది. దీంతో ఎండ ప్రభావం నుంచి ప్రయాణికులకు ఉపశమనం కలిగించేందుకు ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. మూడు నెలల పాటు ఏసీ బస్సుల్లో రాయితీ సౌకర్యం అందుబాటులో ఉండనుంది. అంతేకాకుండా ఏసీ బస్సుల్లో ఆక్యుపెన్సీని పెంచేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏసీ బస్సుల్లో ఆక్సుపెన్సీ తక్కువగా ఉంటుంది. దీంతో డిస్కౌంట్ ఇవ్వడం ద్వారా ఎక్కువమంది ప్రయాణం చేసే అవకాశముంది. ఈ కారణంతో ఆక్యుపెన్సీ పెరగడం వల్ల ఆర్టీసీకి ఆదాయం కూడా పెరుగుతోంది. అటు పెట్రోల్, డీజిల్ ధరల కొరత అంటూ వార్తలు, పెట్రోల్ బంక్‌ల వద్ద క్యూ కడుతున్న క్రమంలో ఆర్టీసీ కీలక సూచన చేసింది. పెట్రోల్ ఎందుకు దండగ.. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించండి అంటూ సూచించింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి పెట్రోల్ ఖర్చులను ఆదా చేసుకోండి అంటూ సూచనలు చేసింది.

Follow Us
మీ ఇంటికే భద్రాచలం సీతారాముల కళ్యాణ తలంబ్రాలు.. ఆర్డర్ చేస్తే..
మీ ఇంటికే భద్రాచలం సీతారాముల కళ్యాణ తలంబ్రాలు.. ఆర్డర్ చేస్తే..
ధనవంతులవ్వాలా? చాణక్యుని ఈ 8 పవర్‌ఫుల్ రూల్స్ ఫాలో అవ్వండి!
ధనవంతులవ్వాలా? చాణక్యుని ఈ 8 పవర్‌ఫుల్ రూల్స్ ఫాలో అవ్వండి!
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో ఆ రోల్ నేను చేయాల్సింది..
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో ఆ రోల్ నేను చేయాల్సింది..
60 ఏళ్ల తర్వాత.. వారికి విముక్తి.. చిటికేస్తే దిగొచ్చి పడతాయ్
60 ఏళ్ల తర్వాత.. వారికి విముక్తి.. చిటికేస్తే దిగొచ్చి పడతాయ్
అక్కడ ఉచితాల వేలం మొదలు.. తొలి విడతగా ఇంటింటికి రిఫ్రిజిరేటర్..
అక్కడ ఉచితాల వేలం మొదలు.. తొలి విడతగా ఇంటింటికి రిఫ్రిజిరేటర్..
ఇండియన్ Vs వెస్ట్రన్ టాయిలెట్.. మీ ఆరోగ్యానికి ఏది మంచిది..?
ఇండియన్ Vs వెస్ట్రన్ టాయిలెట్.. మీ ఆరోగ్యానికి ఏది మంచిది..?
వారికి జీతభత్యాలు పెరిగే ఛాన్స్..! ఇందులో మీ రాశి ఉందా..?
వారికి జీతభత్యాలు పెరిగే ఛాన్స్..! ఇందులో మీ రాశి ఉందా..?
ఓరీ దేవుడో ఏళ్ల తరబడి ఒకే దిండు వాడుతున్నారా?ఈ సమస్యలు గ్యారెంటీ!
ఓరీ దేవుడో ఏళ్ల తరబడి ఒకే దిండు వాడుతున్నారా?ఈ సమస్యలు గ్యారెంటీ!
ఇన్‌స్టాలోకి పవన్ సతీమణి అన్నా లెజినోవా.. ఫస్ట్ పోస్ట్ ఏంటంటే?
ఇన్‌స్టాలోకి పవన్ సతీమణి అన్నా లెజినోవా.. ఫస్ట్ పోస్ట్ ఏంటంటే?
దేశ ప్రజలకు కేంద్రం శుభవార్త.. అందరికీ రూ.5 లక్షల బెనిఫిట్
దేశ ప్రజలకు కేంద్రం శుభవార్త.. అందరికీ రూ.5 లక్షల బెనిఫిట్