రాష్ట్రంలో ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
రాష్ట్రంలో ఎండ తీవ్రత
గురువారం 26 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.
26 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా..
అలాగే 382 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు తెలిపారు. రేపు ఇదే పరిస్థితి కొనసాగుతుందని ప్రజలు ఎండ తీవ్రత, ఉక్కపోత, వడగాలులు పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
రికార్డు ఉష్ణోగ్రతలు
శుక్రవారం రాష్ట్రంలో 62 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 89 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని ఎల్లుండి 07 తీవ్ర, 31 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు.