Telangana BJP: ఖమ్మం ఖిల్లాలో అమిత్ షా పర్యటన.. రైతు భరోసా పేరుతో హిడెన్ ఎజెండా, మొదటి లిస్ట్ రెడీ..
అమిత్ షా ఖమ్మం పర్యటనలో రాష్ట్ర నేతలందరికీ స్పెషల్ టాస్క్‌లు అప్పగించనున్నారు. ఖమ్మంలో పార్టీ రాష్ట్ర నాయకత్వంతో ప్రత్యేకంగా కోర్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో మూడు దిక్కుల నుంచి చెప్పట్టనున్న రథయాత్రలకు అమిత్ షా క్లారిటీ ఇవ్వనున్నారు. రాష్ట్ర నేతలకు పని విభజన, సమన్వయంపై చర్చించనున్నారు. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ 115 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించింది. అభ్యర్థుల ఎంపికలో బీజేపీ అనుసరించనున్న వ్యూహంపై డిస్కస్ చేయనున్నారు. మిషన్ 90 టార్గెట్ ఛేదించడానికి పార్టీ హై కమాండ్ ఏ మేరకు సహాయం చేయగలదు? క్షేత్ర స్థాయిలో..

తెలంగాణపై కాషాయ పార్టీ అగ్రనేతలు ప్రత్యేక దృష్టి పెట్టారు. అమిత్ షా ఖమ్మం పర్యటనలో రాష్ట్ర నేతలందరికీ స్పెషల్ టాస్క్‌లు అప్పగించనున్నారు. ఖమ్మంలో పార్టీ రాష్ట్ర నాయకత్వంతో ప్రత్యేకంగా కోర్ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో మూడు దిక్కుల నుంచి చెప్పట్టనున్న రథయాత్రలకు అమిత్ షా క్లారిటీ ఇవ్వనున్నారు. రాష్ట్ర నేతలకు పని విభజన, సమన్వయంపై చర్చించనున్నారు. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ 115 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించింది. అభ్యర్థుల ఎంపికలో బీజేపీ అనుసరించనున్న వ్యూహంపై డిస్కస్ చేయనున్నారు. మిషన్ 90 టార్గెట్ ఛేదించడానికి పార్టీ హై కమాండ్ ఏ మేరకు సహాయం చేయగలదు? క్షేత్ర స్థాయిలో నేతలు ఏం చేయాలనే దానిపై రాష్ట్ర నాయకత్వానికి అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు.
ఖమ్మం సభ ద్వారా రైతులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేయాలని కమలనాథులు భావిస్తున్నారు. ఖమ్మంలో కేసీఆర్ సర్కార్ రైతులకు బేడీలు వేసిన విషయాన్ని గుర్తుచేస్తూ.. అక్కడ పండే మిర్చికి బోనస్ ఇచ్చే విషయం అమిత్ షా ప్రస్తావించే ఛాన్స్ ఉంది. కౌలు రైతులకు బీజేపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందనే దానిపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అమిత్ షా దూతగా ఎన్నికల క్షేత్రంలో దిగిన బన్సల్ పైకి ఎలాంటి హంగామా కనిపించకుండానే పోలింగ్ బూత్ స్థాయిలో చోచ్చుకువెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు.




ఇప్పటికే 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు వెళ్లిన ఇతర రాష్ట్రాలకు చెందిన బీజేపీ ఎమ్మెల్యేలు పార్టీ హై కమాండ్‌కి రిపోర్ట్ ఇవ్వనున్నారు. పార్టీ బలాలు, బలహీనతలపై పార్టీ అధిష్టానం ఇప్పటికే ఒక అంచనాకు వచ్చింది. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అవసరమైన అస్త్రాలను సంధించాలని బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నారు. ఖమ్మం సభలో భారీగా చేరికలు ఉండే ఛాన్స్ ఉందని కమలనాథులు చెబుతున్నారు.
మరి, కామ్రేడ్లకి, కాంగ్రెస్ కు అడ్డా అనే చెప్పుకునే ఖమ్మం గుమ్మంలో కమల దళం ప్రణాళికలు ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
తెలంగాణలో అమిత్ షా పర్యటనకు సంబంధించిన వివరాలు..
ఖమ్మంలో రైతు సభ. కేసీఆర్ పాలనలో ఆగమైన రైతులకు అండగా బిజెపి. కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలను ఎండగడుదాం. pic.twitter.com/zEhDXqthvm
— BJP Telangana (@BJP4Telangana) August 26, 2023
రైతు గోస… బిజెపి భరోసా.. తెలంగాణ రైతాంగానికి అండగా బిజెపి… ఖమ్మంలో రైతు సభను విజయవంతం చేయండి. pic.twitter.com/2MfInaF8JY
— BJP Telangana (@BJP4Telangana) August 25, 2023
ఖమ్మంలో రైతు సభ. కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీద్ధాం. రైతులకు అండగా నిలుద్ధాం. pic.twitter.com/pX3xgEL2NH
— BJP Telangana (@BJP4Telangana) August 25, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..




