Telangana: ఈటల, కోమటిరెడ్డికి హస్తిన నుంచి పిలుపు.. టీబీజేపీలో ఇంట్రస్టింగ్ గుసగుసలు..
తెలంగాణ బీజేపీలో మరోసారి అలజడి రేగింది. ఉన్నట్టుండి ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌ను ఢిల్లీకి రావాలంటూ కబురు పంపింది పార్టీ అధిష్టానం. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవబోతున్నారు వీళ్లిద్దరూ.
తెలంగాణ బీజేపీలో మరోసారి అలజడి రేగింది. ఉన్నట్టుండి ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌ను ఢిల్లీకి రావాలంటూ కబురు పంపింది పార్టీ అధిష్టానం. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవబోతున్నారు వీళ్లిద్దరూ. అయితే, ఈటల, రాజగోపాల్‌ను అసలు ఢిల్లీ ఎందుకు పిలిచారు?. బుజ్జగింపులు కోసమా? సర్దుబాటు కోసమా? టీబీజేపీలో ఈ అంశంపై ఇప్పుడు హాట్ హాట్ డిస్కర్షన్ నడుస్తోంది.
కర్నాటక ఎన్నికల తర్వాత తెలంగాణ బీజేపీని స్తబ్ధత ఆవరించింది. అప్పటివరకూ దూకుడు మీదున్న కాషాయ నేతల్లో కొంచెం జోరు తగ్గింది. అదే టైమ్‌లో నేతల మధ్య విభేదాలు, అసంతృప్తి జ్వాలలు పార్టీకి ఇబ్బందిగా మారాయి. దాంతో, టీ-బీజేపీని సెట్‌రైట్ చేసేందుకు రంగంలోకి దిగింది హైకమాండ్. నేతల మధ్య సయన్వయ లోపం, కేడర్‌లో అయోమయం, నేతల్లో అసంతృప్తిని తొలగించే పనిలో పడింది అగ్రనాయకత్వం.
ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. కొన్నాళ్లుగా ఈ ఇద్దరూ అసంతృప్తితో రగిలిపోతున్నట్టు టాక్. అందుకే, ఇటీవల ఢిల్లీకి పిలిపించి మాట్లాడింది హైకమాండ్. ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరికీ హస్తిన నుంచి పిలుపొచ్చింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలవనున్నారు ఈటల, రాజగోపాల్‌రెడ్డి.
టీబీజేపీ రథసారధి బండి సంజయ్, చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందిప్పుడు. వీళ్లిద్దరూ కలిసి పనిచేసే పరిస్థితే లేదన్నది పార్టీ వర్గాల టాక్. ఇలాంటి టైమ్‌లో ఈటలకు ఏదైనా కీలక బాధ్యతలు అప్పగిస్తే మరింత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని భయపడుతోంది అధిష్టానం. కర్ర విరగకూడదు-పాము చావకూడదన్నట్టుగా పరిణామాలను చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తోంది. ఆ కసరత్తులో భాగంగానే ఈటల, రాజగోపాల్‌రెడ్డిని ఢిల్లీకి పిలిచినట్టు టాక్.
ఇక ఈటల, రాజగోపాల్‌రెడ్డి ఢిల్లీ టూర్ తర్వాత తెలంగాణ బీజేపీలో కీలక పరిణామాలు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. మరి, అసంతృప్తితో రగిలిపోతోన్న ఈ ఇద్దరు నేతలకు పార్టీ హైకమాండ్ ఎలాంటి భరోసా ఇస్తుంది? బండి-ఈటల మధ్య సయోధ్య కుదుర్చుతారా.. లేక ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తారా? అసలు, బీజేపీ అగ్రనాయకత్వం ఏం చేయబోతోంది? ఇప్పుడీ అంశం మరింత ఆసక్తిరేపుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..