Amit Shah: అమిత్‌షా తెలంగాణ పర్యటన ఖరారు.. చేవేళ్లలో భారీ బహిరంగ సభ.. కీలక నేతల చేరిక
ర్ణాటక ఎన్నికల తర్వాత అమిత్‌షా ఫోకస్ మొత్తం తెలంగాణపైనే నిలపనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీని మరింత పటిష్ఠంగా మార్చేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. కాగా అమిత్ షా తెలంగాణ టూర్‌లో ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలు బీజేపీలో చేరే అవకాశాలున్నాయని..
బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 23న ఆయన తెలంగాణలో అడుగుపెట్టనున్నారు. చేవేళ్ల పార్లమెంట్ పరిధిలో జరిగే భారీ బహిరంగ సభలో కేంద్ర హోం శాఖ మంత్రి పాల్గొననున్నారు. కాగా అమిత్‌షా సభను భారీ సక్సెస్ చేయాలని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. బహిరంగ సభకోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసే యోచనలో ఉన్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత అమిత్‌షా ఫోకస్ మొత్తం తెలంగాణపైనే నిలపనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో పార్టీని మరింత పటిష్ఠంగా మార్చేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. కాగా అమిత్ షా తెలంగాణ టూర్‌లో ఇతర పార్టీలకు చెందిన కీలక నేతలు బీజేపీలో చేరే అవకాశాలున్నాయని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అలాగే రాబోయే ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేసే అవకాశముందని చెబుతున్నారు. కర్ణాటకలో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని అమిత్‌షా నేరుగా హైదరాబాద్ చేరుకుంటారు. అక్కడి నుంచి చేవెళ్లకు అమిత్ షా వెళతారని పార్టీ వర్గాలు చెప్పాయి. ఈ మేరకు అమిత్ షా పర్యటనను విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు.
మరోవైపు అమిత్‌షా పర్యటన రోజే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తన అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా హాజరుకానున్నారు. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్‌లోకి రావాలని ఆహ్వానించారు రాహుల్ గాంధీ.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం.. క్లిక్ చేయండి..