G-20 Summit: హైదరాబాద్‌, వారణాసిలో ప్రారంభమైన జీ-20 సన్నాహక సదస్సులు.. పూర్తి వివరాలివే..

ఈ ఏడాది జరిగే జీ20 సమావేశానికి భారత్ అధ్యక్షత వహిస్తున్న విషయం తెలిసిందే. ప్టెంబర్​9, 10 తేదీల్లో ఢిల్లీలో జరిగే జీ 20 శిఖరాగ్ర సమావేశాలను విజయవంతం చేసేందుకు కేంద్రం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా వరుసగా.. సన్నాహక సమావేశాలను నిర్వహిస్తూ వస్తోంది. దీనిలో భాగంగా హైదరాబాద్‌లో G-20 డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ (DEWG) 2వ సమావేశం సోమవారం ఉదయం ప్రారంభమైంది.

G-20 Summit: హైదరాబాద్‌, వారణాసిలో ప్రారంభమైన జీ-20 సన్నాహక సదస్సులు.. పూర్తి వివరాలివే..
G20 India
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 17, 2023 | 11:33 AM

ఈ ఏడాది జరిగే జీ20 సమావేశానికి భారత్ అధ్యక్షత వహిస్తున్న విషయం తెలిసిందే. ప్టెంబర్​9, 10 తేదీల్లో ఢిల్లీలో జరిగే జీ 20 శిఖరాగ్ర సమావేశాలను విజయవంతం చేసేందుకు కేంద్రం ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా వరుసగా.. సన్నాహక సమావేశాలను నిర్వహిస్తూ వస్తోంది. దీనిలో భాగంగా హైదరాబాద్‌లో G-20 డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ (DEWG) 2వ సమావేశం సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఈరోజు నుంచి మూడు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులతోపాటు పలు దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. G20 డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ లో పురోగతిపై.. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) ఆధ్వర్యంలో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. జీ20 సమావేశాల్లో భాగంగా డీఈడబ్ల్యూజీ సమావేశాలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అలేశ్‌ కుమార్‌ శర్మ, టెలికాం శాఖ కార్యదర్శి రాజారామన్‌ పేర్కొన్నారు. ఈ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి దేవుసిన్హా చౌహాన్‌, కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖల సహాయ మంత్రి నారాయణ స్వామి హాజరయ్యారు. మూడు రోజుల సమావేశాల్లో కొత్తగా వస్తున్న డిజిటల్‌, టెలికాం టెక్నాలజీలు, సాంకేతిక పరిజ్ఞానంతో సమ్మిళిత వృద్ధి సాధించడంపై అంతర్జాతీయ నిపుణులు తమ అనుభవాలు పంచుకోనున్నారు. డిజిటల్‌ ఎకానమీని మరింత విస్తృతం చేయడంతోపాటు, డిజిటల్‌ పబ్లిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, సైబర్‌ సెక్యూరిటీ, డిజిటల్‌ నైపుణ్యాలను మెరుగుపరుచడంపై ఈ సమావేశాల్లో ప్రత్యేకంగా దృష్టిసారించనున్నారు. దీంతోపాటు ఈ విషయాలపై సభ్యదేశాల అభిప్రాయాలను కూడా తీసుకోనున్నారు.

ఈ సందర్భంగా జీ-20 ప్రతినిధులు హైదరాబాద్‌లోని ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ’ (ఐఐటీ)ని సందర్శించనున్నారు. సోమవారం ప్రారంభ కార్యక్రమం, 18న మల్టీ-స్టేక్‌హోల్డర్ కన్సల్టేషన్ అనే వర్క్‌షాప్, 19న పలు అంశాలపై చర్చలు జరగనున్నాయి. జీ-20లో తొలిసారిగా ఈ ఏడాది డిజిటల్‌ ఇన్నోవేషన్‌ అలయెన్స్‌ కార్యక్రమం ప్రవేశపెట్టారు. సభ్యదేశాలు, ఆహ్వానిత దేశాలకు చెందిన స్టార్టప్‌లు దీనిలో పోటీ పడనున్నాయి. దీనిలో గెలుపొందిన స్టార్టప్ లకు బహుమతులు అందజేయనున్నారు. కాగా, G20 ప్రెసిడెన్సీలో భాగంగా భారత్.. MeitY ఫిబ్రవరిలో లక్నోలో మొదటి డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ సమావేశాన్ని నిర్వహించింది. రెండోది హైదరాబాద్ లో జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

వారణాసిలో వ్యవసాయంపై..

ఇదిలాఉంటే.. ఈ రోజు యూపీలోని వారణాసిలో వ్యవసాయ ప్రధాన శాస్త్రవేత్తల సమావేశం జరగనుంది. G20 ప్రెసిడెన్సీ సన్నాహక సదస్సును వారణాసిలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 12000 మందికి పైగా పలు దేశాల ప్రతినిధులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో వ్యవసాయం, అనుభవాలు, భారతదేశం అనుసరిస్తున్న విధానాలను ప్రతి మూలకు తీసుకెళ్లేలా పలు ప్రణాళికల గురించి చర్చించనున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..