Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఎన్నికల షెడ్యూల్‎కు ముందే ప్రజల్లోకి బీజేపీ.. తెలంగాణలో భారీ విజయానికి యాక్షన్ ప్లాన్

ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని బీజేపీ డిసైడ్ అయింది.. అందుకోసం వివిధ రకాల కార్యక్రమాలను ప్లాన్ చేస్తుంది. మోడీ, అమిత్ షా, నడ్డాలతో సభలు ఏర్పాటు చేస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా యాత్రలు కూడా చేపట్టనుంది. తెలంగాణ బీజేపీ పార్లమెంటు ఎన్నికలకు సమాయత్తమవుతుంది.

Telangana: ఎన్నికల షెడ్యూల్‎కు ముందే ప్రజల్లోకి బీజేపీ.. తెలంగాణలో భారీ విజయానికి యాక్షన్ ప్లాన్
Ts Bjp
Follow us
Sridhar Prasad

| Edited By: Srikar T

Updated on: Jan 24, 2024 | 12:56 PM

హైదరాబాద్, జనవరి 24: ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపు ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని బీజేపీ డిసైడ్ అయింది.. అందుకోసం వివిధ రకాల కార్యక్రమాలను ప్లాన్ చేస్తుంది. మోడీ, అమిత్ షా, నడ్డాలతో సభలు ఏర్పాటు చేస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా యాత్రలు కూడా చేపట్టనుంది. తెలంగాణ బీజేపీ పార్లమెంటు ఎన్నికలకు సమాయత్తమవుతుంది. బీజేపీ జాతీయ నాయకత్వం కూడా తెలంగాణ పైన ప్రత్యేక దృష్టి పెట్టింది. 18 నెలల తర్వాత బీజేపీ రాష్ట్ర సంస్థగత ప్రధాన కార్యదర్శిని నియమించింది. లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వివిధ కార్యక్రమాలను రూపకల్పన చేసింది. ఫిబ్రవరి నెల చివరి వరకు తెలంగాణలో ఆ పార్టీ పలు కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పటికే వికసిత్ భారత్ సంకల్ప యాత్రలు తెలంగాణలో జరుగుతున్నాయి.

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి యాత్ర ద్వారా తీసుకెళ్తున్నారు. అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అక్షితల పంపిణీ జరిగింది. దేవాలయాల క్లీనింగ్ కార్యక్రమం జరుగుతుంది. ఈనెల 29 నుండి వచ్చే నెల 29 వరకు రామ మందిర దర్శనం కోసం ప్రత్యేక రైలు రైళ్ళను నడిపించనుంది కేంద్రం. 30 రోజులపాటు 30 ట్రైన్లు తెలంగాణ నుండి అయోధ్యకు వెళ్లనున్నాయి. ఒక్కో ట్రైన్‎లో 1400 మంది రామభక్తులు వెళ్లేందుకు అవకాశం ఉంది. వసతి, భోజనం, ప్రయాణ ఖర్చుల కోసం 1900 రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. రామాలయ దర్శనం కోసం బీజేపీ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. రాష్ట్ర స్థాయిలో కమిటీని కూడా ఏర్పాటు చేసింది.

ఇక పెద్ద ఎత్తున వాల్ రైటింగ్స్ చేపట్టాలని బీజేపీ డిసైడ్ అయింది. ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ అంటూ గోడలపై రాయాలని పార్టీ పిలుపునిచ్చింది. ప్రతి పార్లమెంటు పరిధిలో కనీసం1000 చోట్ల కమలం పువ్వు గుర్తులతో పాటు కేంద్ర ప్రభుత్వం చేసిన కార్యక్రమాలకు రాయాలని పార్టీ నిర్ణయించింది. ఈ కార్యక్రమం తెలంగాణలో కూడా మొదలైంది వచ్చే నెల చివరి వరకు కొనసాగునుంది. సంస్థగత బలోపేతం కోసం పార్టీ గ్రామ ఛలో అభియాన్‎ను చేపట్టనుంది. వచ్చే నెలలో ఒకే రోజున అన్ని గ్రామాల్లో బీజేపీ బూత్ కమిటీలు లేనిచోట ఏర్పాటు చేయడం. ఉన్న చోట బలోపేతం చేయాలని డిసైడ్ అయింది.

ఇవి కూడా చదవండి

ఒక్కో కార్యకర్త తమకు కేటాయించిన పోలింగ్ బూత్‎లో 24 గంటలు ఉండి ఈ పని చేయనున్నారు. చేరికలు పైన కూడా దృష్టి పెట్టనుంది కమలం పార్టీ. దీని కోసం కమిటీని కూడా వేసింది. ఈ నెల 25న జాతీయ నవ ఓటర్ దినోత్సవం సందర్భంగా ప్రతి అసెంబ్లీలో రెండు యువ సమ్మేళనాలు నిర్వహించాలని పార్టీ డిసైడ్ అయింది. ఈ సమ్మేళనాలు ఉద్దేశించి ప్రధాని వర్చువల్‎గా ప్రసంగించనున్నారు. ఈ నెలాఖరు వరకు బీజేపీ అగ్రనేతలు మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాలు తెలంగాణ‎కు వచ్చే అవకాశం ఉంది. వచ్చే నెలలో 10 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా యాత్రలు చేపట్టాలని బీజేపీ నిర్ణయించుకుంది. 5 చోట్ల నుండి యాత్రలు ప్రారంభం అవుతాయని బీజేపీ నేతలు అంటున్నారు. ఫిబ్రవరి నెల చివరి వరకు బీజేపీ వరుస కార్యక్రమాలతో కార్యకర్తలను బిజీగా ఉంచనుంది. బీజేపీ ప్రణాళికలు చూస్తుంటే మార్చి1 తరవాతే ఎన్నికల షెడ్యూలు వెలువడే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..