AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: టాబ్లెట్ల మాటున చాటుమాటు యవ్వారం.. సీన్ తెలిస్తే దిమ్మతిరిగిపోతుంది.!

రోగం, నొప్పితో బాధపడుతూ మెడిసిన్స్‌ కోసం మెడికల్ షాప్‌కి వెళ్తున్నారా? అయితే జర భద్రం.. ఆ మందుబిళ్లలు వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్‌లు రావొచ్చు.. లేనిరోగాలు అంటుకోవచ్చు.. ఏకంగా ప్రాణాలకే ముప్పు వాటిల్లవచ్చు. పక్క రాష్ట్రాల నుంచి టన్నులకొద్ది నకిలీ మందులు దిగుమతి అవుతున్నాయి..

Telangana: టాబ్లెట్ల మాటున చాటుమాటు యవ్వారం.. సీన్ తెలిస్తే దిమ్మతిరిగిపోతుంది.!
drugs
Ravi Kiran
|

Updated on: Jan 24, 2024 | 1:08 PM

Share

రోగం, నొప్పితో బాధపడుతూ మెడిసిన్స్‌ కోసం మెడికల్ షాప్‌కి వెళ్తున్నారా? అయితే జర భద్రం.. ఆ మందుబిళ్లలు వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్‌లు రావొచ్చు.. లేనిరోగాలు అంటుకోవచ్చు.. ఏకంగా ప్రాణాలకే ముప్పు వాటిల్లవచ్చు. పక్క రాష్ట్రాల నుంచి టన్నులకొద్ది నకిలీ మందులు దిగుమతి అవుతున్నాయి. తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు జరిపిన మెరుపు దాడుల్లో భయంకరమైన నిజాలు వెలుగులోకొస్తున్నాయి. ఇంతకీ ఫార్మసీ షాప్‌ల మాటున జరుగుతున్న మతలబేంటి?

రోగం తగ్గాలని ఈ మాత్రలు వేసుకుంటున్నాం. కానీ ఇవి ఎంత డేంజరో మీకు తెలుసా? ఇవి అసలు రోగాన్ని తగ్గించే ట్యాబ్లెట్లే కాదట. పైగా ఆరోగ్యంగా ఉన్న మనిషిని ముప్పు ముంగిట్లోకి నెట్టేసే ప్రమాదకర మెడిసిన్స్ అట. తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు జరిపిన తనిఖీల్లో ఇలాంటి నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి రావడం.. వెన్నులో వణుకు పుట్టిస్తోంది.

తెలంగాణలో 42వేల మెడికల్ షాపులు ఉన్నాయి. ఈ షాపుల్లో కేంద్రం సూచించిన ధరలకు మాత్రమే మెడిసిన్స్ అమ్మాలి. అలాగే ఫార్మా కంపెనీల గోడౌన్లు, ల్యాబ్‌లకు తప్పనిసరిగా డ్రగ్‌ కంట్రోల్ అధికారుల అనుమతి ఉండాలి. కానీ ఈ మధ్య కొన్ని ఫార్మా కంపెనీలు, మెడికల్ షాప్‌లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. ఈ క్రమంలోనే డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆరు నెలలుగా నిఘా పెట్టి.. మెరుపు తనిఖీలు చేపట్టారు. దాడుల్లో అక్రమంగా గోడౌన్లలో మెడిసిన్స్‌ నిల్వలు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే విక్రయాలు జరుపుతున్నట్టు గుర్తించారు. కొన్ని చోట్ల సమస్య చెబితే చాలు.. మందులు రోజుకు ఎన్ని వేసుకోవాలో, ఎప్పుడు వేసుకోవాలో మెడికల్‌ షాప్ సిబ్బంది చెబుతున్నట్టు తెలుసుకుని షాకయ్యారు.

ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో నకిలీ మందులు తయారవుతున్నాయి. అలా తయారవుతున్న మెడిసిన్స్‌ను హైదరాబాద్‌కు డంప్ చేస్తున్నారు కొంతమంది. ఫేక్ యాంటీబయోటిక్స్ తయారు చేసి ట్రాక్ఆన్‌ కొరియర్ సంస్థ ద్వారా దిగుమతి చేస్తున్నారు. కొరియర్ బాయ్ సురేష్‌.. దిల్‌షుఖ్‌నగర్‌లోని వెంకటేశ్వర ఎంటర్‌ప్రైజెస్‌లో ఆర్డర్ తీసుకున్నాడు. పువ్వాడ లక్ష్మణ్ అనే వ్యక్తికి డెలివరీ చేస్తుండగా డ్రగ్ కంట్రోల్‌ అధికారులకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. సురేష్ వెల్లడించిన అంశాలతో తనిఖీలు చేపట్టగా.. నకిలీ మందులు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నట్టు తేలిందన్నారు డ్రగ్ కంట్రోల్ డీజీ. దందా వెనుక మోడస్‌ ఓపెరాండీని బయటపెట్టారాయన.

ఆరు నెలల వ్యవధిల 19 తయారీ యూనిట్లపై అధికారులు దాడులు చేశారు. లక్షల రూపాయలు విలువ చేసే నకిలీ మందులు గుర్తించారు. దాదాపు 4652 శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌లకు పంపించారు. రిపోర్ట్ ఆధారంగా నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు అధికారులు. మరోవైపు మెడికల్ షాపుల్లో బిల్లులు లేకుండానే విక్రయాలు జరుగుతున్నట్టు ఐడెంటిఫై చేశారు.

కొద్దిరోజుల క్రితం మచ్చ బొల్లారంలోని ఓ ఫార్మా కంపెనీ గోడౌన్‌పై దాడులు చేసి నాలుగు కోట్ల 35లక్షల విలువ చేసే మందులు స్వాధీనం చేసుకున్నారు. ఆస్ట్రో జెనరిక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో 36 రకాల మందుల్ని తయారు చేస్తున్నారు. క్యాన్సర్ నివారణకు కోసం ఉపయోగించే మందలంటూ మార్కెట్‌లో చెలామణి చేశారు. ఈ దందా వెనుక సూత్రధారి కడారి సతీష్‌ రెడ్డి.. ఖమ్మంలోని ఆస్పెన్‌ బయో ఫార్మా పేరుతో మరో గోడౌన్ నిర్వహించాడు. అక్కడ తనిఖీలు చేపట్టిన అధికారులు 935కేజీల మత్తు పదార్థాలను సీజ్ చేశారు.

నకిలీ మందులు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే విక్రయాలు జరుగుతున్నాయి. అయితే ఇకపై ఇలాంటి నిర్వాకాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమంటున్నారు డ్రగ్ కంట్రోల్ అధికారులు. ప్రజారోగ్యంతో చెలగాటమాడితే కఠినంగా వ్యవహరిస్తామని మెడికల్‌ ఫార్మా కంపెనీలు, గోడౌన్‌ ఓనర్లను హెచ్చరిస్తున్నారు.

మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ