Hyderabad: ఇన్ఫెక్షన్ ఫ్రీ రోటి మేకర్.. గంటలో ఎన్ని రోటీలు చేస్తుందో తెలుసా…?
సాధారణంగా మన రెగ్యులర్ డైట్ లో చపాతీ ఖచ్చితంగా ఉండాల్సిందే. అనారోగ్యంగా ఉన్నప్పుడు చపాతీ అందరం తప్పకుండా కావాలి అని అనుకుంటాం. ఇంట్లో అయితే 4 ,5 మందికి 15 వరకు చపాతీలు అవసరం అవుతాయి. వాటి కోసం రెండు గంటలు కనీసం కిచెన్‌లో కష్టపడాల్సిందే. మరి అదే ఒక హాస్పిటల్‌లో పేషెంట్‌ల అందరికీ చపాతీ కవల్సివస్తే ఎన్ని కావాలి? ఎంత టైం కావాలి?ఎంత శుభ్రంగా ఉండాలి?కానీ సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో..
హైదరాబాద్, జనవరి 24: సాధారణంగా మన రెగ్యులర్ డైట్ లో చపాతీ ఖచ్చితంగా ఉండాల్సిందే. అనారోగ్యంగా ఉన్నప్పుడు చపాతీ అందరం తప్పకుండా కావాలి అని అనుకుంటాం. ఇంట్లో అయితే 4 ,5 మందికి 15 వరకు చపాతీలు అవసరం అవుతాయి. వాటి కోసం రెండు గంటలు కనీసం కిచెన్‌లో కష్టపడాల్సిందే. మరి అదే ఒక హాస్పిటల్‌లో పేషెంట్‌ల అందరికీ చపాతీ కవల్సివస్తే ఎన్ని కావాలి? ఎంత టైం కావాలి?ఎంత శుభ్రంగా ఉండాలి?కానీ సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఉన్న డైట్ కిచెన్ లో ఉన్న ఇన్ఫెక్షన్ ఫ్రీ రోటి మేకర్‌తో కేవలం గంటలో వేయి చపాతీలు చేస్తున్నారు అక్కడి సిబ్బంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
మామూలుగా చేతితో చపాతీలు చేయడం సహజం. పిండికి సరిపడా నీటిని కలిపి, ఉండలు చుట్టి చపాతీ తయారు చేస్తారు. అయితే వేల మందికి ఒకేసారి చపాతీలు అవసరం అయ్యే ఆసుపత్రులలో అందరి చేతులకు ఉండే కొన్ని రకాల బ్యాక్టీరియా, వైరస్ లతో ఆసుపత్రుల్లో చికిత్స పొందే చాలా మందికి ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి ఇన్ఫెక్షన్ ఫ్రీ రోటిమేకర్ నీ దాతల సహకారంతో గుజరాత్ నుండి లేటెస్ట్ గా తెప్పించారు. వేయి రోటిలు కావాలి అంటే దాదాపు 5,6గంటల సమయం పడ్తుంది. ఆలాంటిది ఈ ఇన్ఫెక్షన్ ఫ్రీ రోటి మేకర్ తో కేవలం గంట సమయంలో వేయి రోటీలు పూర్తి అవుతాయి అని అంటున్నారు గాంధీ డైట్ కిచెన్ సిబ్బంది.
ఈ ఇన్ఫెక్షన్ ఫ్రీ రోటి మేకర్ నీ మేయిటెన్ చేయడం కోసం ఒక వ్యక్తి ఉంటే సరిపోతుంది. పది కిలోల పిండి సరిపడా వాటర్ ఆ మిషేన్ లో వేస్తే సమపాలల్లో కలుపుకుంటుంది. ఆ తరవాత పిండి ముద్ద చిన్న చిన్న పిండి ఉండలుగా కట్ చేసి ముందుకు వేస్తుంది. ఆ తరవాత చిన్న ఉండలని ప్రెస్సింగ్ సిస్టం దగ్గరికి పంపి ఆ తరవాత మీటర్ పొడవు ఉన్న ట్రాలీ లాంటి మిషన్ లోపలి భాగంలోకి ప్రెస్ చేసిన పిండినీ చేరుస్తుంది. అప్పుడు ఆ మెషిన్ లోపల ఏర్పాటుచేసిన సన్నని మంట పై ప్రెస్ అయిన రోటీని కల్చుతుంది. బాలా కాలిన తరువాత అక్కడి నుంచి రోటీలు బయటకి వచ్చి పడతాయి. ఇలా కంటిన్యూ గా జరుగుతుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.