AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Comic Con India Hyderabad: హైదరాబాద్‍లో ‘కామిక్ కాన్ ఇండియా’ ఈవెంట్..ఎంట్రీ పాస్‍ల వివరాలివే..

Hyderabad: యువత ఎంజాయ్ చేసేలా సినిమాటిక్ కేరక్టర్స్ దర్శనమివ్వనుండగా.. పిల్లలను అలరించేలా గేమింగ్స్, కథలు సిద్ధం చేశారు. అమర్ చిత్ర కథ, రాజ్ కామిక్స్ సహా జాతీయ, అంతర్జాతీయ క్రియేటర్స్ ఇందులో పాల్గొనబోతున్నారు. షాపింగ్, గేమింగ్, ఫన్ వాట్ నాట్ అంటూ సందర్శకులకు కామిక్ కాన్-2024 స్వాగతం పలుకుతోంది. ఈ ఎక్స్ పో కి పాసులను

Comic Con India Hyderabad: హైదరాబాద్‍లో ‘కామిక్ కాన్ ఇండియా’ ఈవెంట్..ఎంట్రీ పాస్‍ల వివరాలివే..
Comic Con India
Vidyasagar Gunti
| Edited By: Jyothi Gadda|

Updated on: Jan 24, 2024 | 2:57 PM

Share

Hyderabad: స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్.. ఇలాంటి గేమింగ్, సీని క్యారెక్టర్స్ అన్ని కళ్లముందు ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది. పిల్లలు, యువత్ ఆనందానికి అవధులు ఉండవు. అందుకు మన హైదరాబాద్ వేదిక కాబోతుంది. మాదాపూర్ లోని హైటెక్స్ ఈ శని, ఆదివారాలు అదరహో అనిపించేలా కామిక్ కాన్ -2024 ఈవెంట్ కు అంతా సిద్ధమైంది. యానిమేషన్, గేమింగ్, సినీ, పాప్ అభిమానులను ఊర్రుతలుగించేలా కామిక్ వీకెంట్ రెడీ అయింది.

దాదాపు 3 ఏళ్ల విరామం తర్వాత హైదరాబాద్ లో కామిక్ కాన్ ఈవెంట్ జరగబోతుంది. దీంతో ఎన్నో ప్రత్యేకతలతో ఈసారి నిర్వాహకులు ముందుకు వచ్చారు. ఈ ఎక్స్ పో కు హాజరైన వారికి మార్వెల్ కామిక్ బుక్, లిమిటెడ్ ఎడిషన్ డీసీ కామిక్ బ్యాట్ మ్యాన్ పోస్టర్ తో పాటు కామికాన్ ఇండియా బ్యాగ్ అందివ్వనున్నారు. ఈ ఈవెంట్ లో సంజయ్ గుప్తా, లిలోరోష్, యాసిడ్ టోడ్, గార్బేజ్ బిన్, కార్పొరేట్ రచించిన ఇండస్వర్స్, యాలీ డ్రీమ్స్ క్రియేషన్స్, సూఫీ కామిక్స్, ప్రసాద్ భట్, రాజ్ కామిక్స్ వంటి ఎంతో మంది కళాకారులుస ఎన్నో కామిర్ బుక్స్, కార్టూన్స్ అలరించబోతున్నాయి. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు శని, ఆదివారాల్లో ఈవెంట్ జరగనుంది. ఈ థ్రిల్లింగ్ వీకెంట్ హైదరాబాద్ వాసులకు అందించేందుకు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నామని కామిక్ కాన్ ఇండియా ఫౌండర్ జతిన్ వర్మ తెలిపారు.

యువత ఎంజాయ్ చేసేలా సినిమాటిక్ కేరక్టర్స్ దర్శనమివ్వనుండగా.. పిల్లలను అలరించేలా గేమింగ్స్, కథలు సిద్ధం చేశారు. అమర్ చిత్ర కథ, రాజ్ కామిక్స్ సహా జాతీయ, అంతర్జాతీయ క్రియేటర్స్ ఇందులో పాల్గొనబోతున్నారు. షాపింగ్, గేమింగ్, ఫన్ వాట్ నాట్ అంటూ సందర్శకులకు కామిక్ కాన్-2024 స్వాగతం పలుకుతోంది. ఈ ఎక్స్ పో కి పాసులను కామిక్ కాన్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. సూపర్ ఫ్యాన్ పాస్ 3299 రూపాయలు కాగా డే వైజ్ పాస్ 899 రూపాయలుగా ధర నిర్ణయించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..