Telangana: “బర్డ్స్ ఆఫ్ తెలంగాణ” పాకెట్ గైడ్‌ను ఆవిష్కరించిన ఉపముఖ్యమంత్రి

తెలంగాణలోని పక్షుల గురించి భవిష్యత్ తరాలకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ (HBP) సభ్యులచే అనుసంధానం చేయబడిన "బర్డ్స్ ఆఫ్ తెలంగాణ" పాకెట్ గైడ్ ఉపయోగపడుతుందని ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.

Telangana: బర్డ్స్ ఆఫ్ తెలంగాణ పాకెట్ గైడ్‌ను ఆవిష్కరించిన ఉపముఖ్యమంత్రి
Birds Of Telangana
Follow us
Velpula Bharath Rao

|

Updated on: Nov 06, 2024 | 10:05 PM

తెలంగాణలోని పక్షుల గురించి భవిష్యత్ తరాలకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ (HBP) సభ్యులచే అనుసంధానం చేయబడిన “బర్డ్స్ ఆఫ్ తెలంగాణ” పాకెట్ గైడ్ ఉపయోగపడుతుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. బుధవారం ప్రజా భవన్లో హైదరాబాద్ బర్డింగ్ పాల్స్(HBP) సభ్యులచే అనుసంధానం చేయబడిన “బర్డ్స్ ఆఫ్ తెలంగాణ” పాకెట్ గైడ్ ను డిప్యూటీ సీఎం ఆవిష్కరించారు. ఈ పుస్తకం అవసరాన్ని హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ (HBP) కోర్ కమిటీ సభ్యులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్బంగా హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ (HBP) సభ్యులు”బర్డ్స్ ఆఫ్ తెలంగాణ” పాకెట్ గైడ్‌ను రూపొందించడానికి వారు చేసిన కృషిని, వారి అవగాహన కార్యక్రమాలను ఉపముఖ్యమంత్రి అభినందించారు.

హైదరాబాద్ బర్డింగ్ పాల్స్(HBP) ప్రెసిడెంట్ ఆడెపు హరికృష్ణ తెలంగాణ పక్షుల గురించి మొదటి పాకెట్ గైడ్ యొక్క ప్రాముఖ్యతను, ఆవశ్యకతను ఉప ముఖ్యమంత్రికి వివరించారు. ఈ పుస్తకం తెలంగాణ పక్షుల ఆహారం, వలసలు, పరిరక్షణ స్థితి గురించి తెలుసుకోవటానికి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పారు. ఈ పుస్తకం విద్యార్థులు, ప్రకృతి ఔత్సాహికులు, విభిన్న ప్రేక్షకులను ప్రత్యేక జీవ వైవిధ్యంతో కూడుకొన్న తెలంగాణ ప్రకృతితో మమేకం కావటానికి ప్రోత్సహిస్తుంది. మొత్తం 252 ముఖ్యమైన పక్షి జాతులను కలిగి ఉన్న ఈ పాకెట్ గైడ్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల, ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ఉచితంగా అందించబడుతుందని వివరించారు.

వీడియో ఇదిగో:

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!