AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రోడ్డెక్కిన తెలంగాణ రాజకీయం..! ఈ రచ్చ రంబోలా దేనికోసం?

ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా బీఆరెస్‌, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తుండగా... కేసీఆర్‌ నల్గొండ సభతో అది పీక్స్‌కు చేరింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి బహిరంగసభలో పాల్గొన్న గులాబీబాస్‌... కాంగ్రెస్‌ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ను... ప్రతిపక్షంగా ఐదేళ్లపాటు వెంటాడి వేటాడుతామని హెచ్చరించారు.

Telangana: రోడ్డెక్కిన తెలంగాణ రాజకీయం..! ఈ రచ్చ రంబోలా దేనికోసం?
Telangana Politics
Shaik Madar Saheb
|

Updated on: Feb 14, 2024 | 6:58 PM

Share

Big News Big Debate: అసెంబ్లీ ఎన్నికలు ముగిసి.. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న వేళ,, తెలంగాణ రాకీయం మరింత హీటెక్కుతోంది. అసెంబ్లీ అయినా… పబ్లిక్‌ మీటింగ్‌ అయినా… పట్టపగ్గాల్లేవన్నట్టుగా మాటల తూటాలు పేలుస్తున్నారు నేతలు. నువ్వొకటంటే.. నేను రెండంటా అన్నట్టుగా కౌంటర్లు, ఎన్‌ కౌంటర్లతో పరస్పరం విరచుకుపడుతున్నారు.

ఇప్పటికే అసెంబ్లీ సాక్షిగా బీఆరెస్‌, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తుండగా… కేసీఆర్‌ నల్గొండ సభతో అది పీక్స్‌కు చేరింది. ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి బహిరంగసభలో పాల్గొన్న గులాబీబాస్‌… కాంగ్రెస్‌ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ను… ప్రతిపక్షంగా ఐదేళ్లపాటు వెంటాడి వేటాడుతామని హెచ్చరించారు.

కేసీఆర్‌ వ్యాఖ్యలపై అదే స్థాయిలో స్పందించారు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి. దమ్ముంటే అసెంబ్లీలో చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. ప్రజలు ఇప్పటికే కేసీఆర్‌ ప్యాంటు విప్పేశారనీ… బొక్కబోర్లా పడినా బుద్ధిరాలేదనీ… తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ చచ్చిన పాము అంటూ.. ఘాటు వ్యాఖ్యలేచేశారు రేవంత్‌.

బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లైవ్ వీడియో చూడండి..

రేవంత్‌ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన బీఆర్‌ఎస్‌ నేతలు.. ఆ మాటల్ని రికార్డుల నుంచి తొలిగించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ.. సభ నుంచి వాకౌట్‌ చేశారు. మైక్‌ కట్‌చేసి తమ గొంతు నొక్కుతున్నారని ఆరోపించారు.

ఏ రికార్డుల నుంచి చెరిపేసినా, చెరిపేయకున్నా… నేతలు వాడుతున్న ఈ పదప్రయోగాలు ప్రజల్లోకి మాత్రం బాగానే వెళ్తున్నాయి. ఇంతకీ నేతలకు భాష సమస్యా? భావం సమస్యా? అనే చర్చ కూడా నడుస్తోంది. తెలంగాణ రాజకీయాన్ని రోడ్డెక్కించారన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..