Viral News: బార్బర్ షాప్ వదిలి చెట్టుకిందే దుకాణం పెట్టిన నాయి బ్రహ్మణుడు.. ఎందుకంటే..
అసలే కరోనా కాలం.. ఆపై కోవిడ్ రూపాంతరం చెందుతూ.. ప్రజలపై విరుచుకుపడుతూ.. దీంతో ఎప్పుడూ ఎలా వ్యాప్తి చెందుతోఅని భయాందోళనకు గురవతున్నారు.
అసలే కరోనా కాలం.. ఆపై కోవిడ్ రూపాంతరం చెందుతూ.. ప్రజలపై విరుచుకుపడుతూ.. దీంతో ఎప్పుడూ ఎలా వ్యాప్తి చెందుతోఅని భయాందోళనకు గురవతున్నారు. టీకా రెండు డోసులు తీసుకున్నాక కానీ.. మాస్క్ ధరించడం.. సామాజిక దూరం పాటించడం తప్పనిసరి అంటున్నారు నిపుణులు. అయితే ఈ మహామ్మారి ప్రభావంతో చిన్న వ్యాపారస్తులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. అయితే ఓ బార్బర్ మాత్రం.. కరోనా కట్టడి చేసేందుకు ఉపాదిగా ఉన్న షాపును వదిలి.. ఓ చెట్టు కింద దుకాణం పెట్టి అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.
వివరాల్లోకెళితే.. పెద్దపల్లి జిల్లా సూల్తానాబాద్ కు చెందిన నరేందర్ వృత్తి రీత్యా నాయీ బ్రహ్మణుడు.సుల్తానాబాద్ మున్సిపాలిటీలోని శాస్త్రీనగర్ లో నివసిస్తున్న నరేందర్…బార్బర్ షాపు నిర్వహిస్తూ జీవనోపాధి సాగించేవారు. అయితే, కరోనా సమయంలో పూట గడవడం కష్టంగా మారడంతో విధిలేని పరిస్థితిలో ప్రాణాలను పణ్ణంగా పెట్టి కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ క్షౌర వృత్తిని నమ్ముకొని జీవనం సాగిస్తున్నాడు. అయితే తన షాపుకు ఎక్కువ మంది కస్టమర్లు వస్తున్నారని, అందులో సామాజిక దూరం పాటించకుంటే వచ్చిన కస్టమర్లకు, తనకు కరోనా సోకుతుందని భావించాడు. దీంతో వెంటనే షాపును వదిలి సమీపంలోని ఓ చెట్టుకింద మాస్క్ ధరించి, శానిటైజర్ వాడుతూ కస్టమర్లకు కటింగ్, షేవింగ్ చేస్తూ కరోనా నిబంధనలను పాటిస్తున్నాడు. ఇక నరేందర్ ఆలోచన నచ్చి.. కస్టమర్లు కూడా ఎక్కువగా ఇతని దగ్గరికే వస్తున్నారు.
వీడియో..