Brahmamgari Matam: ముదురుతున్న బ్రహ్మంగారి మఠం వారసత్వ వివాదం.. త్వరలోనే పీఠాధిపతిని ప్రకటిస్తామన్న మంత్రి వెల్లంపల్లి

పోతులూరి వీరబ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎవరు? ఇన్నాళ్లు సాగుతున్న వివాదానికి ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తెరదించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Brahmamgari Matam: ముదురుతున్న బ్రహ్మంగారి మఠం వారసత్వ వివాదం..  త్వరలోనే పీఠాధిపతిని ప్రకటిస్తామన్న మంత్రి వెల్లంపల్లి
Ap Minister Vellampalli Srinivas Visits Pothuluri Veerabrahmendra Swamy Matam
Follow us

|

Updated on: Jun 18, 2021 | 9:31 PM

Minister Vellampalli visits Brahmamgari Matam: పోతులూరి వీరబ్రహ్మంగారి మఠం పీఠాధిపతి ఎవరు? ఇన్నాళ్లు సాగుతున్న వివాదానికి ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తెరదించేందుకు ప్రయత్నిస్తున్నారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ బ్రహ్మంగారి మఠంలో ఇరువర్గాలతో చర్చించారు. కాలజ్ఞాని బ్రహ్మం గారి దర్శనం అనంతరం పీఠాధిపతి వివాదం పై శ్రీ వీర బోగ వసంత వెంకటేశ్వర స్వామి వారి ఇరువురు భార్యల సంతానంతో సంప్రదింపులు జరిపారు.

బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వారసత్వ వివాదం మరింత ముదురుతోంది.. హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం మొదటి భార్య పెద్ద కుమారుడికే మఠాధిపత్యం అర్హత ఉందని శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి ప్రకటించారు అయితే నిర్ణయించే అధికారం ఆయనకు ఎక్కడిదని ప్రభుత్వం వాదిస్తోంది. విద్వేషాలను రెచ్చగొట్టే ప్రకటనలు చేయొద్దని.. ప్రభుత్వమే సరైనా నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు మంత్రి వెల్లంపల్లి.

ఈ నేపథ్యంలోనే బ్రహ్మంగారి మఠాన్ని సందర్శించిన మంత్రి వెల్లంపల్లికి ఆలయ అధికారులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ క్రమంలో వీరబ్రహ్మేంద్రస్వామి సజీవ సమాధిని దర్శించుకున్న మంత్రి వెల్లంపల్లి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, స్థానిక నేతలు ఆయన వెంట ఉన్నారు.

కాగా బ్రహ్మంగారి మఠాధిపతి వీరభోగ వసంతవెంకటేశ్వరస్వామి ఇటీవల శివైక్యం చెందిన నేపథ్యంలో పీఠాధిపత్యంపై వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన వారసులతో మంత్రి వేర్వేరుగా మంత్రి చర్చలు కొనసాగిస్తున్నారు. మఠం నివాసంలో వీరభోగ వసంతవెంకటేశ్వరస్వామి రెండవ భార్య మారుతి మహాలక్షుమ్మతో మాట్లాడిన మంత్రి.. టీటీడీ అతిథి గృహంలో మొదటి భార్య కుమారులతో చర్చలు జరిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. బ్రహ్మంగారి మఠం పీఠాధిపత్యం వివాదానికి త్వరలో తెరపడనుందనే సంకేతాలు ఇచ్చారు. వివాదానికి కారణమైన రెండు వర్గాలు ఏకాభిప్రాయంతో నిర్ణయానికి రావాలని కోరిన ఆయన త్వరలోనే పీఠాధిపతిని ప్రకటిస్తామని పేర్కొన్నారు.

ఇదిలావుంటే, వీరభోగ వసంతవెంకటేశ్వరస్వామికి ఇద్దరు భార్యలు. ఆయన పెద్ద భార్య చంద్రావతికి నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. చంద్రావతి అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన పదేళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నారు. రెండో భార్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు మైనర్లు. పెద్ద భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రి స్వామి (53), రెండో భార్య పెద్ద కుమారుడు గోవిందస్వామి (9)ల మధ్య పోటీ నెలకొంది. అయితే గోవిందస్వామి మేజర్‌ అయ్యేంతవరకు తాను ప్రస్తుతం మఠం బాధ్యతలను తాత్కాలికంగా స్వీకరిస్తానంటూ రెండో భార్య మారుతి మహాలక్షుమ్మ పోటీలోకి వచ్చారు. దీంతో పీఠాధిపత్యంపై వివాదం నెలకొంది.

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో