Jadcherla Road accident: మహబూబ్‌నగర్ జిల్లాలో కాంక్రీట్ రెడీ మిక్చర్ లారీ బీభత్సం.. ట్రాక్టర్, రెండు బైకులను ఢీ కొట్టిన లారీ.. నలుగురు మృతి
మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన లారీ వేగంగా వచ్చి ట్రాక్టర్, రెండు ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు.

Jadcherla Road Accident
Four kills in Jadcherla Road accident: మహబూబ్‌నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జడ్చర్ల మండలం గంగాపూర్ శివారులో కాంక్రీట్ రెడీ మిక్చర్ వాహనం బీభత్సం సృష్టించింది. అదుపుతప్పిన లారీ వేగంగా వచ్చి ట్రాక్టర్, రెండు ద్విచక్ర వాహనాలను ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
