AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చనిపోయిందనుకున్న భార్య నుంచి ఓటీపీ.. పరుగెత్తుకెళ్లిన భర్త.. దిమ్మతిరిగే ట్విస్ట్‌తో అంతా షాక్..

రెండేళ్లుగా సాగుతున్న ఈ మిస్టరీలో ఒక్క OTP పెను సంచలనం సృష్టించింది.. భార్యను అత్తమామలే చంపేశారని భర్త కోర్టు మెట్లెక్కాడు. కట్ చేస్తే.. సడన్‌గా భర్త ఫోన్‌కి వచ్చిన ఒక ఓటీపీ, చనిపోయిందనుకున్న భార్య ఎక్కడ ఉందో, ఎవరితో ఉందో అనే విషయాలను బయటపెట్టింది. అసలు ఆ ఓటీపీ ఎలా వచ్చింది? ఏం జరిగింది..? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

చనిపోయిందనుకున్న భార్య నుంచి ఓటీపీ.. పరుగెత్తుకెళ్లిన భర్త..  దిమ్మతిరిగే ట్విస్ట్‌తో అంతా షాక్..
Missing Woman Found Alive After 2 YearsImage Credit source: AI Generated Photo
Krishna S
|

Updated on: Feb 19, 2026 | 8:49 AM

Share

సినిమా ట్విస్ట్‌ను మించి ఉంది ఈ కథ. చనిపోయిందనుకున్న భార్య.. రాజస్థాన్‌లో వేరే వ్యక్తితో కాపురం చేస్తూ, ఆధార్ కార్డు అప్డేట్ చేయబోయి అడ్డంగా బుక్కైపోయింది. ఒక చిన్న OTPతో రెండేళ్లుగా సాగుతున్న హైడ్రామాకు తెరపడింది. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాకు చెందిన సందీప్‌కు, ప్రియాంకకు 2018లో వివాహమైంది. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. అయితే 2024 జూలైలో భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో ప్రియాంక నగలతో సహా పుట్టింటికి వెళ్ళిపోయింది. అక్కడి నుండి కొడుకును తీసుకుని అయోధ్యలోని సరయు నదిలో దూకి చనిపోవాలని ప్లాన్ చేసింది. సరిగ్గా అక్కడే ఎంట్రీ ఇచ్చాడు రాజస్థాన్‌కు చెందిన మంగళచంద్ర. ఆమెను కాపాడటమే కాకుండా తనతో పాటు రాజస్థాన్‌కు తీసుకెళ్లిపోయాడు. అక్కడే ఇద్దరూ భార్యాభర్తల్లా ఉండటం మొదలుపెట్టారు.

అత్తమామలపై హత్య కేసు

భార్య, కొడుకు కనిపించకపోవడంతో కంగారుపడ్డ సందీప్.. తన అత్తమామలే నగల కోసం వాళ్లను చంపి నదిలో పడేశారని అనుమానించాడు. పోలీసులు కేసు పెట్టకపోవడంతో కోర్టుకెళ్లి మరీ నవంబర్ 4న ప్రియాంక తల్లిదండ్రులపై హత్య కేసు ఫైల్ చేయించాడు. పాపం.. బిడ్డను పోగొట్టుకున్న బాధలో ఉన్న అత్తమామలు జైలు పాలయ్యే పరిస్థితి వచ్చింది.

ఆ ఒక్క OTP.. సీన్ మార్చేసింది

రెండేళ్లు గడిచాక.. ప్రియాంక తన గుర్తింపు మార్చుకోవాలని రాజస్థాన్‌లో ఆధార్ సెంటర్ కి వెళ్లింది. అక్కడ ఆధార్ అప్డేట్ చేయగానే లింక్ అయి ఉన్న పాత మొబైల్ నంబర్‌కు OTP వెళ్లింది. ఆ నంబర్ ఇప్పుడు భర్త సందీప్ దగ్గర ఉంది. ఫోన్ కి వచ్చిన OTPని చూసి సందీప్ షాక్ అయ్యాడు. చనిపోయిందనుకున్న నా భార్య ఆధార్ అప్డేట్ ఏంటి? అని ఆరా తీసి పోలీసులకు ఉప్పందించాడు.

క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్

పోలీసులు రాజస్థాన్ వెళ్లి ప్రియాంకను పట్టుకుని బస్తీకి తీసుకువచ్చారు. చనిపోయిందనుకున్న భార్యను చూసి సందీప్ ఎమోషనల్ అయ్యాడు కానీ ఆమె బ్రతుకుతున్న తీరు చూసి షాక్ అయ్యాడు. నాకు ఈ భార్య వద్దు.. నా కొడుకు కావాలి అని సందీప్ మొత్తుకున్నాడు. కానీ ఆ బాబుట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కోర్టులో ప్రియాంక వాంగ్మూలాన్ని నమోదు చేశారు పోలీసులు. మాత్రం నువ్వు నా తండ్రివి కావు.. నేను నీతో రాను అని తేల్చి చెప్పేశాడు. ప్రియాంక రాజస్థాన్ వ్యక్తితో ఉంటున్న ప్రభావం ఆ పిల్లాడిపై పడిన

Follow Us
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!
ఈ రాశులకు కుజ-చంద్రుల అనుగ్రహం.. డబ్బుకు లోటే ఉండదు!