Plastic Waste: ఇకపై ప్లాస్టిక్ వ్యర్ధాలను ఐస్ క్రీంలో వేసుకుని ఇంచక్కా తినేయొచ్చని చెబుతున్న శాస్త్రవేత్తలు..

Plastic Waste: మొదటిసారి, శాస్త్రవేత్తలు ప్లాస్టిక్ వ్యర్థాల నుండి ఐస్ క్రీంలో వాడే వనిల్లా రుచిని సృష్టించారు. దీనికోసం జన్యుపరంగా మార్పు చెందిన బ్యాక్టీరియాను దాని తయారీలో ఉపయోగించారు.

Plastic Waste: ఇకపై ప్లాస్టిక్ వ్యర్ధాలను ఐస్ క్రీంలో వేసుకుని ఇంచక్కా తినేయొచ్చని చెబుతున్న శాస్త్రవేత్తలు..
Plastic Waste
Follow us
KVD Varma

|

Updated on: Jun 18, 2021 | 9:38 PM

Plastic Waste: మొదటిసారి, శాస్త్రవేత్తలు ప్లాస్టిక్ వ్యర్థాల నుండి ఐస్ క్రీంలో వాడే వనిల్లా రుచిని సృష్టించారు. దీనికోసం జన్యుపరంగా మార్పు చెందిన బ్యాక్టీరియాను దాని తయారీలో ఉపయోగించారు. ఈ ప్రయోగాలు చేసి విజయవంతం అయిన ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ జోవన్నా సాడ్లర్ మాట్లాడుతూ, ప్లాస్టిక్ వ్యర్థాల నుండి విలువైన రసాయనాన్ని తయారు చేయడానికి ఇది మొదటి ఉదాహరణ అని చెప్పారు. ప్లాస్టిక్ వ్యర్థాలు ఇక పనికిరానివి కాదని ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన స్టీఫెన్ వాలెస్ చెప్పారు. ప్లాస్టిక్ వ్యర్థాలు సమస్య అనే ఆలోచన నుంచి మా పరిశోధనలు మొదలయ్యాయి. ఇది కార్బన్ కొత్త మూలం, దీని నుంచి అనేక ఉత్పత్తులను తయరు చేయవచ్చు అని ఆయన అంటున్నారు.

వనిల్లా రుచిని ఎలా తయారు చేశారు? దీని ఉపయోగం ఏమిటి?

గ్రీన్ కెమిస్ట్రీ పత్రికలో ప్రచురించిన పరిశోధన ప్రకారం, శాస్త్రవేత్తలు మొదట ఇ-కోలి బ్యాక్టీరియా జన్యువును మార్చారు. అప్పుడు బ్యాక్టీరియా సహాయంతో, ప్లాస్టిక్ నుండి తయారుచేసిన టెరెఫ్తాలిక్ ఆమ్లం 79 శాతం వరకు వనిలిన్ గా మార్చగలిగారు. వనిలిన్ ఆహారం, పానీయంగానే కాకుండా సౌందర్య సాధనాలలో ఉపయోగిస్తారు. ఇవే కాకుండా, శుభ్రపరిచే ఉత్పత్తులు, కలుపు సంహారకాల తయారీలో ఫార్మా పరిశ్రమలలో కూడా దీనిని విరివిగా వాడతారు.

ప్రపంచవ్యాప్తంగా వనిల్లా బీన్స్ కోసం డిమాండ్ పెరుగుతోంది. 2018 లో, డిమాండ్ 37 వేల టన్నులు. ఇది సరఫరా కంటే చాలా ఎక్కువ. అనేక ఉత్పత్తులలో దాని ఉపయోగం కారణంగా, దాని డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలోని వనిలిన్ సరఫరాలో 85 శాతం శిలాజ ఇంధనాల నుంచి ఉత్పత్తి అవుతుంది. మిగిలిన 15 శాతం ఇతర మార్గాల ద్వారా తయారు చేస్తారు.

ఇక మరోవైపు ప్లాస్టిక్‌లో 14 శాతం మాత్రమే రీసైకిల్ చేయగలుగుతున్నారు. ప్రపంచంలో ప్రతి నిమిషం 1 మిలియన్ సీసాలు అమ్ముడవుతాయి. ఇందులో 14 శాతం మాత్రమే రీసైకిల్ చేస్తున్నారు. ప్రస్తుతం, రీసైకిల్ సీసాల నుండి బట్టలు, తివాచీలు మాత్రమే తయారు చేయవచ్చు. కానీ కొత్త ఆవిష్కరణ తరువాత, ఇప్పుడు వనిల్లా రుచిని కూడా తయారు చేయవచ్చు. దీని నుండి తయారుచేసిన ఉత్పత్తిని పెర్ఫ్యూమ్‌లో కూడా ఉపయోగించవచ్చు అని డిన్‌బర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Also Read: Car That Runs on Water : నీటి మీద నడిచే కారు వచ్చేసింది..! వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు.. ధర ఎంతో తెలుసా..?

Helmet: మెదడు పని తీరును తెలుసుకునే హెల్మెట్‌.. అభివృద్ధి చేసిన అమెరికాకు చెందిన కెర్నల్‌ సంస్థ