AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Realme Smartphones: రూ. 15వేల లోపే రెండు ఫోన్లు, స్మార్ట్‌ టీవీని లాంచ్ చేయనున్న రియల్‌మీ..!

రియల్‌మీ నార్జో 30 4జీ, నార్జో 30 5జీ స్మార్ట్ ఫోన్‌లతోపాటు 32 ఇంచుల ఫుల్ హెచ్‌డీ టీవీలను జూన్ 24 న నిర్వహించే ఈవెంట్‌లో విడుదల చేయనుంది రియల్‌ మీ.

Realme Smartphones: రూ. 15వేల లోపే రెండు ఫోన్లు, స్మార్ట్‌ టీవీని లాంచ్ చేయనున్న రియల్‌మీ..!
Realme Narzo 30
Venkata Chari
|

Updated on: Jun 18, 2021 | 5:51 PM

Share

Realme: రియల్‌మీ వరుసగా స్మార్ట్ ఫోన్లతో పాటు స్మార్ట్‌ టీవీలను లాంచ్ చేస్తూ విఫణిలో దూసుకపోతోంది. ఎంఐ తో పోటీపడేందుకు సిద్ధమైంది. తాజాగా రియల్‌మీ నార్జో 30 4జీ, నార్జో 30 5జీ స్మార్ట్ ఫోన్‌లతోపాటు 32 ఇంచుల ఫుల్ హెచ్‌డీ టీవీలను లాంచ్ చేయనుంది. జూన్ 24 న నిర్వహించే ఈవెంట్‌లో వీటిని విడుదల చేయనుంది. సోషల్ మీడియాలో ఈవెంట్ ను లైవ్ లో చూడొచ్చని ప్రకటించింది. రియల్ మీ ఫుల్ హెచ్‌డీ స్మార్ట్ టీవీని అల్ట్రా బ్రైట్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే తో అందించనుందని తెలుస్తోంది. క్వాడ్ స్టీరియో స్పీకర్లతో రానున్న ఈ టీవీలో స్టీరియోస్కోపిక్ సౌండ్ అవుట్ పుట్ తో అలరించనుందని టాక్. అయితే, ఇవి దాదాపు రూ.15 వేలలోపే ఉండనున్నాయని తెలుస్తోంది.

రియల్ మీ నార్జో 30 4జీ 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్ ప్లేతో రానున్న ఈ స్మార్ట్ ఫోన్‌.. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉండనుంది. ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్‌తో ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. అయితే ప్రస్తుతం ఈ మోడల్ 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో విడుదల కానుంది. స్టోరేజీని మైక్రో ఎస్‌డీ కార్డుతో 256 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఇతర స్టోరేజీలపై సమాచారం లేదు. వెనకవైపు 3 కెమెరాలతో రానున్న ఈ ఫోన్‌లో మెయిన్‌ కెమెరా 48 మెగాపిక్సెల్‌గా ఉండనుంది. అలాగే 2 మెగాపిక్సెల్ బ్లాక్ అండ్ వైట్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉండనున్నాయి. ఫ్రంట్‌సైడ్‌ 16 మెగాపిక్సెల్ కెమెరాను సెల్పీలు, వీడియో కాల్స్‌ కోసం అందించారు. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం తోపాటు 30W ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. కేవలం 25 నిమిషాల్లో సంగం బ్యాటరీ చార్జింగ్ అవనుందని కంపెనీ పేర్కొంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ యూఐ 2.0 ఆపరేటింగ్ సిస్టం ఇన్‌బిల్ట్‌గా రానుంది.

రియల్‌మీ నార్జో 30 5జీ 6.5 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ డిస్ ప్లేతో ఈ ఫోన్‌ రానుంది. ఇందులోనూ 90 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ ఉండనుంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌ ను ఇందులో అందించారు. 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌తో ఈ స్మార్ట్ ఫోన్ రానుది. 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యంతో రానున్న ఈ ఫోన్ లో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ కూడా ఉండనుందంట. ఇందులో కూడా వెనుకవైపు 3 కెమెరాలు ఉంటాయి. వీటిలో మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్‌ కాగా, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ లెన్స్, 2 మెగాపిక్సెల్ టెర్టియరీ సెన్సార్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్‌లో 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. ఇందులోనూ రియల్‌మీ యూఐ 2.0 ఓస్ ఉండనుంది. ఈ ఓస్‌ను ఆండ్రాయిడ్ 11 ఆధారంగా రియల్‌మీ మార్పులుచేసింది. ఈ ఫోన్‌ 5జీ, 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేస్తుంది.

Also Read:

Car That Runs on Water : నీటి మీద నడిచే కారు వచ్చేసింది..! వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు.. ధర ఎంతో తెలుసా..?

Apple iOS: పాత ఐఫోన్లు వాడుతున్నారా.. కొత్త సెక్యూరిటీ అప్‌డేట్‌ తో మరింత భద్రం!