AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Apple iOS: పాత ఐఫోన్లు వాడుతున్నారా.. కొత్త సెక్యూరిటీ అప్‌డేట్‌ తో మరింత భద్రం!

మీరు పాత ఐఫోన్‌లు వాడుతున్నారా..? ఎటువంటి అప్‌డేట్స్ రావడం లేదని నిరుత్సాహపడుతున్నారా..! అయితే మీకోసం ఓ సరికొత్త సెక్యూరిటీ అప్‌డేట్‌ ను తీసుకొచ్చింది ఆపిల్‌ కంపెనీ.

Apple iOS: పాత ఐఫోన్లు వాడుతున్నారా.. కొత్త సెక్యూరిటీ అప్‌డేట్‌ తో మరింత భద్రం!
Ios 12.5 .4
Venkata Chari
|

Updated on: Jun 18, 2021 | 12:07 PM

Share

Apple iOS: మీరు పాత ఐఫోన్‌లు వాడుతున్నారా..? ఎటువంటి అప్‌డేట్స్ రావడం లేదని నిరుత్సాహపడుతున్నారా..! అయితే మీకోసం ఓ సరికొత్త సెక్యూరిటీ అప్‌డేట్‌ ను తీసుకొచ్చింది ఆపిల్‌ కంపెనీ. పాత ఐఫోన్‌ 5S, ఐఫోన్‌ 6, ఐఫోన్‌ 6 ప్లస్‌ ఫోన్లు ప్రస్తుతం iOS 12తో నడుస్తున్నాయి. గతకొంత కాలంగా ఈ ఫోన్లకు ఎటువంటి అప్‌డేట్స్ రావడం లేదు. కనీసం సెక్యూరిటీ అప్‌డేట్‌లను కూడా విడుదల చేయలేదు ఆపిల్ కంపెనీ. ఈ తాజా సెక్యూరిటీ అప్ డేట్ లో ఆపిల్ ఫోన్‌లు సెక్యూరిటీ మరింత పెరగనుంది. ఐఫోన్ 5s, ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్, ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ మినీ 2, ఐప్యాడ్ మినీ 3, 6 వ తరం ఐపాడ్ టచ్ వంటి వాటికి ఈ సెక్యూరిటీ అప్‌డేట్ వచ్చింది. ఈమేరకు ఆపిల్ ఓ నోట్‌ ను విడుదల చేసింది. ఈ మేరకు పాత ఐఫోన్ 5s, ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్, ఐప్యాడ్ ఎయిర్, ఐప్యాడ్ మినీ 2, ఐప్యాడ్ మినీ 3, 6వ తరం ఐపాడ్ టచ్ యూజర్లు కచ్చితంగా 12.5.4 కు అప్‌డేట్ చేసుకోవాలని కోరింది. భద్రతా పరమైన సమస్యలు రాకుండా ఉండేందుకు ఈ అప్‌డేట్ చాలా కీలకమని పేర్కొంది. ఐఫోన్‌లో ప్రధానంగా వాడే వెబ్‌కిట్‌లో కొన్ని లోపాలు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పాతఫోన్‌లు హ్యకింగ్‌కు గురయ్యే అవకాశం ఉన్నట్లు గమనించిన ఆపిల్ సంస్థ… పాత ఫోన్లకు ఈ సెక్కూరిటీ అప్‌డేట్ ను అందించింది. పాత ఓస్‌లలో లోపాలను సరిదిద్దేందుకు కూడా అప్‌డేట్‌లను ఇస్తోంది.

అందుకే పాత ఆపిల్ ఫోన్లు, ట్యాబ్‌లలో డేటా చోరీకి గురయ్యే అవకాశం ఉందని, వెంటనే ఈ కొత్త సెక్కూరిటీ అప్‌డేట్ ను ఫోన్లో డౌన్‌లోడ్ చేసుకోవాలిన కోరింది. పాత ఐఫోన్‌ను అప్‌డేట్‌ చేసేందుకు ఇలా చేయాలి. మొదట సెట్టింగ్స్ అనే ఆఫ్షన్‌కు వెళ్లాలి. అనంతరం జనరల్‌ అనే ఆఫ్షన్‌పై క్లిక్ చేయాలి, తరువాత సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ పై క్లిక్ చేయాలి. అయితే, ఈ అప్‌డేట్ క్రొత్త iOS ని అప్‌డేట్ చేయడం కోసం దానికి కావలసిన మెమొరీని ఖాళీగా ఉంచాలి.

2020లో విడుదలైన ఓ సర్వేలో 5.3 శాతం ప్రజలు ఐఫోన్‌ 6, 1.42 శాతం మంది ఐఫోన్‌ 6 ప్లస్, 1.55 శాతం మంది 5ఎస్‌ ను వాడుతున్నారంట. అందుకే ఆపిల్ సంస్థ తాజాగా సెక్యూరిటీ అప్‌డేట్‌ను విడుదల చేసిందని తెలుస్తోంది. ఇప్పటికే వెబ్‌కిట్‌లో కొంత హ్యాకింగ్‌కు గురైందనే సమచారం మేరకు పాత ఫోన్లలో వాడే వెబ్‌కిట్‌ లో కొన్ని మార్పులు చేసిందంట.

మరోవైపు తాజాగా ఆపిల్ iOS 15 ను మరికొద్ది రోజుల్లో విడుదల చేసేందకు ఆపిల్‌ సంస్థ ప్లాన్ చేస్తోంది. ఈ అప్‌డేట్‌ దాదాపు 20 మోడళ్లకు రానున్నట్లు సంస్థ తెలిపింది. ఇందులో ఐఫోన్ 6S, ఐఫోన్ 6S ప్లస్, ఐఫోన్ SE కూడా ఉన్నాయి. దాదాపు 2015 లో విడుదలైన ఈ ఫోన్లకు కూడా iOS 15ను అందించనున్నట్లు సంస్థ ప్రకటించింది. అయితే, కొత్త ఫోన్లల్లో ఉండే అన్ని ఫీచర్లు ఈ పాతతరం ఫోన్లకు అందుబాటులో ఉండవు.