Sun Rainbow Video: ఆకాశంలో అద్భుతం.. సూర్యని చుట్టూ రంగుల వలయం.. సంబర పడిన జనం

ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. శుక్రారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఒక అరగంట పాటు అద్భుతం చోటుచేసుకుంది. సూర్యుడి చుట్టూ ఇంద్ర ధనస్సు కాంతి వలయంగా కనపించింది.

Sun Rainbow Video: ఆకాశంలో అద్భుతం.. సూర్యని చుట్టూ రంగుల వలయం.. సంబర పడిన జనం
Sun Rainbow
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 18, 2021 | 2:05 PM

ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. శుక్రారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఒక అరగంట పాటు అద్భుతం చోటుచేసుకుంది. సూర్యుడి చుట్టూ ఇంద్ర ధనస్సు కాంతి వలయంగా కనపించింది. దీంతో మహబూబాబాద్‌లో పలువురు ప్రజలు ఆశ్చర్యనికి గురై ఆసక్తిగా తిలకించారు. పరిసర ప్రాంతాల్లో ఈ అద్భుత దృశ్యాలను చాలామంది తమ సెల్ ఫోన్లలో ఫోటోలు తీసుకున్నారు కనిపించిన ఈ సన్నివేశం చూపరులను కనువిందు చేసింది.

ఎందుకు ఇలా ఏర్పడుతుంది…

ఆకాశంలో మేఘాలు ఎక్కువగా ఉన్న సమయంలో వాటిలోని నీటి బిందువులపై పడిన కాంతి కిరణాలు వక్రీభవనం చెందడం వల్ల ఈలాంటి వలాయాలు ఏర్పాడుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది శీతల దేశాల్లో తరుచూ కనిపిస్తుందని … అయితే భారత్‌వంటి ఉష్ణమండల ప్రాంతాల్లో అప్పుడప్పుడు కనిపిస్తుందని తెలిపారు.

“సన్ హాలో..” అంటే…(What is Sun’s halo?)

సిరస్ మేఘాలలో ఉన్న షట్కోణ మంచు స్ఫటికాలపై కిరణాలు రిఫ్లెక్ట్ అయినప్పుడు ఇలా జరుగుతుంది. దీనిని కాలిడోస్కోపిక్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. చంద్రుని చుట్టూ హాలో సంభవించినప్పుడు దానిని మూన్ రింగ్ లేదా వింటర్ రింగ్ అంటారు. ఇదే సూర్యుని చుట్టూ ఏప్పడితే “సన్ హాలో” అని అంటారు.

సాధారణంగా నీటి ఆవిరి భూమి ఉపరితలం నుండి 5-10 కిలోమీటర్ల ఎత్తులో మంచు స్ఫటికాలలో గడ్డకట్టినప్పుడు సిరస్ మేఘాలు ఏర్పడతాయి. ఇక తాజాగా ఈ అద్భుతమైన వీడియోను స్థానిక ప్రజలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో ఈ వింత రెయిన్ బో చూడటానికి నగరవాసులు ఆసక్తి చూపించారు. డాబాలపైకి ఎక్కి ఈ వింతను తమ మొబైల్ ఫోన్లలో బంధించారు.

ఆకాశంలో అద్భుతం.. వీడియో ఇక్కడ చూడండి…

ఇవి కూడా చదవండి : Rythu Bandhu: అత్యధిక లబ్ధిదారులు ఈ జిల్లా రైతులే.. చురుగ్గా సాగుతున్న రైతు బందు పంపిణీ

CJI NV Ramana: శ్రీశైల భ్రమరాంబ మల్లిఖార్జున స్వామివారిని ద‌ర్శించుకున్న సీజేఐ ఎన్వీ రమణ దంప‌తులు..

CM Mamata: పంతం వీడని మమతా…సువేందు అధికారి గెలుపుపై కలకత్తా హైకోర్టులో పిటిషన్..

Tipu Sultan: సీఎం జగన్ సొంత జిల్లాలో కొత్త వివాదం.. టిప్పు సుల్తాన్‌ విగ్రహ ఏర్పాటుపై కమలం నేతల ఆందోళన

AP Job Calendar: నిరుద్యోగులకు శుభ వార్త.. జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయనున్న ముఖ్యమంత్రి జగన్