MLC Srinivas Reddy Corona kit: ‘ఇంట్లోనే ఉందాం.. క్షేమంగా ఉందాం’.. మెడికల్ కిట్‌తో పాటు మందు బాటిల్.. ప్రజా ప్రతినిధులకు ఎమ్మెల్సీ నజరానా!

'కరోనా' కష్టకాలంలో అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు కొందరు మానవతావాదులు.. కొందరు లాక్‌డౌన్‌ వేళ పేదల ఆకలి తీరుస్తూ నేనున్నానంటూ వారి కడుపు నిండా భోజనం పెట్టే ఏర్పాట్లు చేస్తున్నారు.

MLC Srinivas Reddy Corona kit: ‘ఇంట్లోనే ఉందాం.. క్షేమంగా ఉందాం’.. మెడికల్ కిట్‌తో పాటు మందు బాటిల్.. ప్రజా ప్రతినిధులకు ఎమ్మెల్సీ నజరానా!
Mlc Pochampally Srinivas Reddy Supplied Corona Kit With Whisky Bottle
Follow us
Balaraju Goud

|

Updated on: Jun 18, 2021 | 2:26 PM

MLC Pochampally Srinivas Reddy Corona kit: ‘కరోనా’ కష్టకాలంలో అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు కొందరు మానవతావాదులు.. కొందరు లాక్‌డౌన్‌ వేళ పేదల ఆకలి తీరుస్తూ నేనున్నానంటూ వారి కడుపు నిండా భోజనం పెట్టే ఏర్పాట్లు చేస్తున్నారు. మరికొందరు ఆసుపత్రుల్లో ఉన్నవారికి వైద్య సాయం అందిస్తూ ఆక్సిజన్ సిలిండర్ల దగ్గర నుంచి మందుల వరకు అందిస్తున్నారు. ఇంకొందరు దేశ, విదేశాల్లో చిక్కుకుపోయిన ఇబ్బందుల్లో ఉన్నవారికి వెంటనే స్వదేశానికి రప్పిస్తూ చేయూతను అందిస్తున్నారు. అయితే, ఇదే కోవలో తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్సీ మరో అడుగు ముందుకేసి.. తనకు ఎన్నికల సమయంలో సాయం అందించినవారికి అపన్న హస్తం అందిస్తున్నారు.

ఈ ఎమ్మెల్సీ రూటే సెపరేటు. కరోనా కష్టకాలంలో ప్రజలకు కొందరు రాజకీయ నాయకులు, వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థలు తమకు తోచిన సాయం చేస్తున్నారు. అయితే, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి మాత్రం మరో అడుగు ముందుకేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించినవారికి మెడికల్ కిట్‌బ్యాగులను పంపించారు. అయితే, ఇందులో విశేషమేముందని అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్‌.

మెడికల్‌ కిట్లు అనగానే శానిటైజర్, మాస్కులు, పల్స్‌ ఆక్సీమీటర్‌.. మహా అయితే డ్రైఫ్రూట్స్‌ ఉంటాయని అంతా భావించారు. కానీ, ఆ ప్యాక్‌ తెరిచి చూసినవారు అవాక్కయ్యారు. ఎందుకంటారా?! పైన చెప్పినవే కాకుండా ఆ ప్యాక్‌లో టీచర్స్‌ విస్కీ పుల్ బాటిల్‌ కూడా ఉంది మరి! మహబూబాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, మున్సిపల్‌ కౌన్సిలర్లకు ‘ఇంట్లోనే ఉందాం.. క్షేమంగా ఉందాం’ అనే నినాదంతోపాటు శ్రీనివాస్‌రెడ్డి ఫొటోతో ఉన్న కిట్‌బ్యాగ్‌ను గురువారం ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ పంపిణీ చేశారు. దీంతో ప్యాక్‌ తీసుకున్న వారందరూ ‘మా మంచి లీడర్‌’ అంటూ మురిసిపోతూ ఇళ్లకు బయలుదేరారు.

Read Also….  

Older Vehicles: మీరు పాత వాహనాలు నడుపుతున్నారా..? అయితే జాగ్రత్త.. రూ.10 వేలు జరిమానా కట్టాల్సిందే..!

VIRAL VIDEO : కేరళలో ఒక్కడే బావిని తవ్వేశాడు..! నెటిజన్లు అతడిని వన్ మ్యాన్ ఆర్మీ అని పిలుస్తున్నారు..

జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?