Fake 2K Currecy: 2 వేల నోటును కలర్ జిరాక్స్ తీసి తీసి చెలామణి చేస్తున్న యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు

Fake 2K Currecy: నకిలీ నోట్ల తయారీని అరికట్టడానికి 2016లో కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసింది. అనంతరం సరికొత్త టెక్నాలజీతో 2 వేల నోట్లను, రూ. 500 నోట్లను..

Fake 2K Currecy: 2 వేల నోటును కలర్ జిరాక్స్ తీసి తీసి చెలామణి చేస్తున్న యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
Fake Currecy
Follow us

|

Updated on: Jun 18, 2021 | 1:13 PM

Fake 2K Currecy: నకిలీ నోట్ల తయారీని అరికట్టడానికి 2016లో కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసింది. అనంతరం సరికొత్త టెక్నాలజీతో 2 వేల నోట్లను, రూ. 500 నోట్లను ముద్రించింది. వీటి నకిలీ సృష్టి కష్టమని అప్పట్లో అధికారులు ప్రకటించింది. అయితే తరచుగా మనం నకిలీ నోట్లను పట్టుకున్నట్లు తరచుగా వార్తలు వింటూనే ఉన్నాం.. తాజాగా ఓ యువకుడు నోట్లను ముద్రిస్తే.. కష్టమైన పని అనుకున్నట్లు ఉన్నాడు.. ఏకంగా రెండు వేల రూపాయల నోట్లను జిరాక్స్ తీసి చలామణి చేయడానికి చూసాడు.. ఇప్పుడు కటకటాలు పాలయ్యాడు ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

రెండు వేల రూపాయల నకిలీ నోట్లను మారుస్తున్న ఉప్పరి రాజు ప్రసాద్ అనే వ్యక్తిని కేపీహెచ్ బీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి ఆరు 2 వేల రూపాయల నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇతను కలర్ జిరాక్స్ మెషిన్ ఉపయోగించి ఎనిమిది 2 వేల రూపాయల నోట్లు నకలు(జిరాక్స్) తీసినట్లు పోలీసులు చెప్పారు. అయితే ఈ ఉప్పరి రాజు ఇలా నకిలీ నోట్లను చెలామణి చేస్తూ.. పోలీసూలకు పట్టుబడడం ఇదే మొదటి సారి కాదు.. గతంలో కూడా నకిలీ నోట్లు చెలామణి చేస్తూ ఐదు పోలీసు స్టేషన్లలో పట్టుబడి నిందితుడు జుడిష్యల్ కస్టడీకి వెళ్ళి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు.

Also Read: నువ్వు నా విషయంలో యాక్షన్ తీసుకోకపోతే నా రియాక్షన్ తట్టుకోలేవు అంటూ కార్తీక్ కి వార్నింగ్ ఇచ్చిన మోనిత