ఇక, సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇదిలాఉంటే.. గతేడాది నవంబర్ నెలలో జనగామ జిల్లా కొడకండ్లలో పర్యటన ముగించుకుని తిరుగు పయనమైన సీఎం కేసీఆర్ వాసాలమర్రిలో ఆగి, గ్రామాభివృద్ధిపై స్థానికులతో చర్చించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా వాసాలమర్రి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 22వ తేదీన వాసాలమర్రి గ్రామాన్ని సందర్శించాలని నిర్ణయించుకున్నారు. ఇదే విషయాన్ని గ్రామ సర్పంచ్‌కి ఫోన్ చేసి తెలిపారు.
Also read:
Two Crows Harass : పోకిరి కాకులపై పోలీసులకు ఫిర్యాదు..! ఇంతకీ ఏం చేశాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు..