Covid-19 Hospital: పిల్లల కోసం కోవిడ్ ఆసుపత్రిని ఏర్పాటు చేయండి.. డీఆర్‌డీఓకు వీహెచ్‌పీ వినతి

VHP writes DRDO: డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరుతో హైదరాబాద్‌లో చిన్న పిల్లల కోసం ప్రత్యేక కోవిడ్-19 ఆసుపత్రిని నెలకొల్పాలని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌

Covid-19 Hospital: పిల్లల కోసం కోవిడ్ ఆసుపత్రిని ఏర్పాటు చేయండి.. డీఆర్‌డీఓకు వీహెచ్‌పీ వినతి
Covid Third Wave
Follow us

|

Updated on: Jun 18, 2021 | 2:50 PM

VHP writes DRDO: డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పేరుతో హైదరాబాద్‌లో చిన్న పిల్లల కోసం ప్రత్యేక కోవిడ్-19 ఆసుపత్రిని నెలకొల్పాలని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీఓ)ను కోరింది. డీఆర్‌డీఓ పరిశోధనలకు హైదరాబాద్ ఒక మూల కేంద్రమని వీహెచ్‌పీ పేర్కొంది. దేశంలోని వివిధ పట్టణాలలో తాత్కాలిక కోవిడ్ ఆసుపత్రులు నిర్మిస్తున్న డీఆర్‌డీవో హైదరాబాద్ నగరంలో కూడా కోవిడ్ హస్పిటల్ ఏర్పాటు చేయాలని కోరింది. కోవిడ్ థర్డ్ వేవ్‌ ఎక్కువగా చిన్న పిల్లలపై ప్రభావం చూపుతుందని వస్తున్న వార్తలతో.. ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని వీహెచ్‌పీ పేర్కొంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో కూడా ప్రత్యేకంగా చిన్న పిల్లల కోసం కనీసం 500 పడకలతో కూడిన తాత్కాలిక కోవిడ్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని డీఆర్‌డీవోకు విన్నవించింది.

అయితే.. తాత్కాలిక కోవిడ్ ఆసుపత్రికి మాజీ రాష్ట్రపతి, భారతరత్న డా. అబ్దుల్ కలాం పేరుతో నెలకొల్పితే బాగుంటుందని వీహెచ్‌పీ అభిప్రాయపడింది. హైదరాబాద్ లోని డీఆర్‌డీఓతో, చిన్న పిల్లలతో కలాంకు విడదీయలేని అనుబంధం ఉన్న విషయాన్ని లేఖలో గుర్తుచేసింది. అయితే.. ఈ తాత్కాలిక ఆసుపత్రి నిర్మాణానికి సికింబ్రాబాద్‌లో రక్షణ శాఖకు సంబంధించిన అనేక ఖాళీ స్థలాలు కూడా అందుబాటులో ఉన్నాయని వివరించింది. ఈ విషయంలో డీఆర్‌డీఓ నుంచి సానుకూల నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నట్లు వీహెచ్‌పీ రాష్ట్ర అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ పెర్కొన్నారు.

Also Read:

Telangana Crime News: ఇంటిపైన‌ నీటి ట్యాంకులో చిన్నారి మృతదేహం.. విచార‌ణ‌లో కంగుతిన్న ఖాకీలు !

Rythu Bandhu: అత్యధిక లబ్ధిదారులు ఈ జిల్లా రైతులే.. చురుగ్గా సాగుతున్న రైతు బందు పంపిణీ