Jacqueline Fernandez: ప్రియుడితో కలిసి కొత్త ఇల్లు కొన్న బాలీవుడ్ బ్యూటీ జాక్వలిన్..

Rajeev Rayala

Rajeev Rayala |

Updated on: Jun 18, 2021 | 2:25 PM

జాక్వలిన్‌ ముంబైలో కొత్త ఇల్లు తీసుకున్నారు... అనేది లేటెస్ట్ న్యూస్‌! ఇందులో కొత్తేం ఉంది.. ఆల్రెడీ తాప్సీ ముంబైలో ఇల్లు కొన్నారు.

Jacqueline Fernandez: ప్రియుడితో కలిసి కొత్త ఇల్లు కొన్న బాలీవుడ్ బ్యూటీ జాక్వలిన్..
జాక్వెలిన్ పెర్నాండెజ్..హరిహర వీరమల్లు.. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్.. క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు. ఇందులో ఇస్మార్ట్ భామ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. మరో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటిస్తుంది.

Follow us on

jaqualine : జాక్వలిన్‌ ముంబైలో కొత్త ఇల్లు తీసుకున్నారు… అనేది లేటెస్ట్ న్యూస్‌! ఇందులో కొత్తేం ఉంది.. ఆల్రెడీ తాప్సీ ముంబైలో ఇల్లు కొన్నారు. రకుల్‌, రాశీ,లావణ్య హైదరాబాద్లో సొంతిల్లు తీసుకున్నారు.. రీసెంట్‌గా బిగ్‌ బీ కూడా జబర్దస్త్ ఇల్లు కొనుక్కున్నారు. ఇలా రోజూ ఏదో ఒకటి చూస్తూనే ఉన్నాం కదా అని అనుకుంటున్నారా? అయితే .. జాక్వలిన్‌ విషయంలో అంతకు మించి మరో విషయం ఉందండోయ్‌!సాహోలో ప్రభాస్‌తో పోటీ పడి నాజూకు డ్యాన్సులు చేసిన జాక్వలిన్‌ ఇప్పుడు పవన్‌ కల్యాణ్‌తో నటిస్తుంది. టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు  అనే సినిమా చేస్తున్నాడు. మొగలాయిలా కాలం నాటి కథతో ఈ సినిమా తెరకెక్కబోతుంది. ఈ సినిమా పవన్ కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో రాబోతుంది. ఇక ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనుపించనుండగా.. జాక్వలిన్‌ యువరాణి పాత్రలో నటిస్తుందని అంటున్నారు.  అయితే  ఓ వైపు సినిమాలు కెరీర్‌ అంటూ బిజీగానే ఉన్నా, మరోవైపు పర్సనల్‌ లైఫ్‌లోనూ సెటిల్‌ అయ్యే ప్రయత్నాల్లోనే ఉన్నారు ఈ బ్యూటీ

డౌన్‌ సౌత్‌కి చెందిన ఓ బడా బిజినెస్‌ మ్యాన్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్నారట జాక్వలిన్‌. అతనితో కలిసి జుహులో బీచ్‌ ఫేస్‌ ఉండేలా ఓ ఇల్లు కొంటున్నారట. ఇద్దరూ కలిసి ఇంటీరియర్స్ మీద స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారట. ఇంతకీ ఆ బిజినెస్‌ మ్యాన్‌ ఎవరన్న విషయాన్ని మాత్రం జాక్వలిన్‌ సీక్రెట్‌గా ఉంచుతున్నారు. సర్లెండి… రేపోమాపో మా కంట పడకపోతారా? అంటున్నారు నెటిజన్లు

మరిన్ని ఇక్కడ చదవండి : 

Fathers Day 2021: “ప్రతి తండ్రీ కొడుకే కావాలనుకుంటాడు..కానీ కావలసింది కూతురు మాత్రమే” హాలీవుడ్ న‌టుడు డ్వేన్ జాన్సన్‌! వీడియో వైరల్

Dhanush: టేబుల్ ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న ధనుష్ సినిమా.. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న జగమే తంత్రం..

Mahesh Babu: మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘సర్కారు వారి పాట’ నుంచి క్రేజీ అప్‌డేట్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu