Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian IT sector: ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ . త్వరలో భారత్ లో టాప్ ఐటీ కంపెనీల్లో భారీగా నియామకాలు

Indian IT sector: కరోనా వైరస్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి జన జీవనమే కాదు.. ఆర్ధిక పరిస్థితి పై కూడా ప్రభావం పడింది. ఇక ఉద్యోగ కల్పనలో కూడా అనేక ఇబ్బందులు..

Indian IT sector:  ఐటీ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ . త్వరలో భారత్ లో టాప్ ఐటీ కంపెనీల్లో భారీగా నియామకాలు
It Sector
Follow us
Surya Kala

|

Updated on: Jun 18, 2021 | 2:36 PM

Indian IT sector: కరోనా వైరస్ వెలుగులోకి వచ్చినప్పటి నుంచి జన జీవనమే కాదు.. ఆర్ధిక పరిస్థితి పై కూడా ప్రభావం పడింది. ఇక ఉద్యోగ కల్పనలో కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే తాజాగా పలు ఐటీ దిగ్గజాలు త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నాయని.. భారీ సంఖ్యలో ఉద్యోగులను చేర్చుకోనున్నారని ప్రముఖ ఐటీ పరిశ్రమ సంస్థ నాస్కామ్ తెలిపింది. వివరాల్లోకి వెళ్తే..

2021-22లో భారతీయ టాప్ 5 ఐటి కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగులను చేర్చుకోవాలని భావిస్తున్నట్లు నాస్కామ్ వెల్లడించింది. రోజు రోజుకీ సాంకేతిక పరిజ్ఞానంపెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగ కల్పన చేపడుతున్నారు ఈ ఏడాది ప్రారంభంలో 1,38,000 మంది ఉద్యోగులను చేర్చుకున్నామని నాస్కామ్ ఒక ప్రకటనలో తెలిపింది.

అయితే ఇప్పుడు 2021-22 ఏడాదిలో భారత దేశంలోని మొదటి స్థానంలో ఉన్న 5 ఐటీ కంపెనీలు 96,000 మంది ఉద్యోగులను  చేర్చుకోవాలని అనుకుంటున్నాయని తెలిపింది. తమ కంపెనీలో 40,000 మందికి పైగా కొత్తగా డిజిటల్ శిక్షణ పొందిన టాలెంట్ ఉన్నవాళ్ళను నియమించుకుందని ఇలా చేయడం వలన కంపెనీ బాగా డెవలప్ అవుతుందని అన్నారు.

2025 నాటికి పరిశ్రమ 300-350 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించగలమని ధీమా వ్యక్తం చేసింది. నాస్కామ్-మెకిన్సే రిపోర్ట్ ప్రకారం బిపిఎమ్ కోసం 180-220 బిలియన్ డాలర్లు వెచ్చిస్తున్నట్టు చెప్పింది. భారతదేశంలో బిపిఓ పరిశ్రమ ప్రపంచ కస్టమర్ల కోసం కాస్త కొత్తగా ఇన్నోవేటివ్ గా వస్తోంది అని అంది. మహమ్మారి సంవత్సరంలో ఎదుగుదల మరియు ముందుకు వచ్చే అవకాశాన్ని చూపిస్తుంది అని నాస్కామ్ పేర్కొంది. ఇది ఇలా ఉంటే మరోవైపు బ్యాంక్ ఆఫ్ అమెరికా నివేదిక ప్రకారం పరిశ్రమల మధ్య, ముఖ్యంగా టెక్ ప్రదేశం లో ఆటోమేషన్ లాభాలు పెరిగే కొద్దీ 2022 నాటికి దేశీయ సాఫ్ట్‌వేర్ సంస్థలు 3 మిలియన్ ఉద్యోగాలను తగ్గించనున్నాయని తెలిపింది.

Also Read: 2 వేల నోటును కలర్ జిరాక్స్ తీసి తీసి చెలామణి చేస్తున్న యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు శ్రీ గోవిందరాజస్వామివారికి కరోనా నిబంధన నడుమ పుష్పయాగం