Indian IT companies: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. టాప్ -5 ఐటీ కంపెనీల్లోనే 96 వేల ఉద్యోగ అవకాశాలు: నాస్కామ్
Indian IT companies: టాప్-5 ఐటీ కంపెనీలోనే 96 వేల ఉద్యోగాలు లభించనున్నాయని పరిశ్రమ సంస్థ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ గురువారం..
Indian IT companies: టాప్-5 ఐటీ కంపెనీలోనే 96 వేల ఉద్యోగాలు లభించనున్నాయని పరిశ్రమ సంస్థ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ గురువారం తెలిపింది. దేశంలో ఐటీ నిపుణుల అవకాశాలు భారీగా వస్తున్నాయని ఐటీ పరిశ్రమలు చెబుతున్నాయి. ఆటోమేషన్ వల్ల ఐటీ రంగంలో ఉద్యోగులకు భారీ ఎత్తున నష్టం వాటిల్లుతోందని తాజా వాదనపై ఐటీ పరిశ్రమ బాడీ నాస్కామ్ స్పందించింది. ప్రస్తుతం ఐటీ ప్రొఫేషల్‌కు భారీ డిమాండ్ కనిపిస్తోందని పేర్కొంది. దేశంలోని టాప్-5 ఐటీ సంస్థలు 2021-22లో 96 వేల మంది ఉద్యోగులను నియమించుకోవాలని భావిస్తోందని పేర్కొంది.2022 సంవత్సరం నాటికి భారతీయ సాఫ్ట్‌వేర్ సంస్థలు 30 లక్షల ఉద్యోగాలను తొలగించబోతున్నాయని, తద్వారా సంవత్సరానికి 100 బిలియన్ డాలర్లను ఆదా చేసుకోవాలని భావిస్తున్నాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా నివేదించిన తర్వాత నాస్కామ్ ప్రకటన రావడం గమనార్హం.
అయితే దేశీయ ఐటీ రంగంలో 2021-22లో నియామకాలు వేగవంతం కానున్నాయని నాస్కామ్ చెబుతోంది. ఆటోమేషన్ కారణంగా ఉద్యోగాలకు ముప్పు ఉందన్న బీఓఏ వ్యాఖ్యలపై స్పందిస్తూ సాంకేతిక పరిజ్ఞానంతో, పెరుగుతున్న ఆటోమేషన్ కారణంగా సాంప్రదాయ ఐటీ ఉద్యోగాలు, పాత్రల స్వభావం మారనుందని తెలిపింది. ఫలితంగా కొత్త ఉద్యోగాల కల్పనకు దారితీస్తుందని వ్యాఖ్యానించింది. నిపుణులకు డిమాండ్ ఎక్కువగా ఉందని, 2021 ఏడాదిలో 1,38,000 ఉద్యోగులను చేర్చుకుందని నాస్కామ్ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. టాప్-5 సంస్థలే సుమారు 96 వేల మందిని రిక్రూట్ చేసుకోబోతున్నాయని పేర్కొంది. దీంతోపాటు 2 లక్షల 50వేల మందికి పైగా ఉద్యోగుల్లో డిజిటల్ నైపుణ్యాలను పెంపొందిస్తోందని, అలాగే 40 వేలమందిని డిజిటల్ ప్రతిభావంతులను నియమించిందని తెలిపింది.
ఇదిలా ఉంటే కంపెనీ 250,000 మందికి పైగా ఉద్యోగులను డిజిటల్ నైపుణ్యాలలో పెంచుతోంది మరియు 40,000 మందికి పైగా కొత్తగా డిజిటల్ శిక్షణ పొందిన నైపుణ్యం ఉన్నవాళ్ళని నియమించింది. దీని వల్ల కంపెనీ మరింతగా అభివృద్ధి చెందుతోందన్నారు. 2025 నాటికి పరిశ్రమ 300-350 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సాధించగలదని ట్రాక్‌లో ఉంది అని నాస్కామ్ తెలిపింది.
నాస్కామ్-మెకిన్సే రిపోర్ట్ ప్రకారం బిపిఎమ్ కోసం 180-220 బిలియన్ డాలర్లు వెచ్చిస్తున్నట్టు చెప్పింది. భారతదేశంలో బిపిఓ పరిశ్రమ ప్రపంచ కస్టమర్ల కోసం కాస్త కొత్తగా ఇన్నోవేటివ్ గా వస్తోందని తెలిపింది. కరోనా మహమ్మారి సంవత్సరంలో ఎదుగుదల మరియు ముందుకు వచ్చే అవకాశాన్ని చూపిస్తుంది అని నాస్కామ్ పేర్కొంది.