AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bandi Sanjay: క్షమాపణలు చెప్పాలి.. బండి సంజయ్‌ వర్సెస్ కేటీఆర్‌.. లీగల్‌ టర్న్‌ తీసుకున్న పొలిటికల్‌ వార్‌..

బండి సంజయ్‌ చేసిన కామెంట్లపై కేటీఆర్‌ న్యాయ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.. కేటీఆర్‌ క్షమాపణలు డిమాండ్ చేస్తుండగా, బండి సంజయ్‌ క్షమాపణలు చెప్పేది లేదని, తన వ్యాఖ్యల్లో తప్పులేదని స్పష్టం చేశారు. ఇద్దరి మధ్య న్యాయ పోరాటం మొదలైంది.. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Bandi Sanjay: క్షమాపణలు చెప్పాలి.. బండి సంజయ్‌ వర్సెస్ కేటీఆర్‌.. లీగల్‌ టర్న్‌ తీసుకున్న పొలిటికల్‌ వార్‌..
KTR Bandi Sanjay
Shaik Madar Saheb
|

Updated on: Oct 29, 2024 | 3:23 PM

Share

తెలంగాణ రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్‌ గేమ్‌ నడుస్తోంది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కామనే కాని.. ఒకరిపై ఒకరు లీగల్‌ నోటీసులు ఇవ్వడం.. కొత్త టర్న్‌. ప్రస్తుతం దావాల ట్రెండ్‌ నడుస్తుండడంతో.. కేంద్రమంత్రి కూడా అదే బాటపట్టారు. బండి సంజయ్‌ వర్సెస్ కేటీఆర్‌. పొలిటికల్‌ వార్‌ కాస్తా.. కోర్టుల వరకు వెళ్లి లీగల్‌ బ్యాటిల్‌లా మారిపోయింది. ఇటీవల కేటీఆర్‌పై కేంద్రమంత్రి, బీజేపీ నేత బండి సంజయ్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ డ్రగ్స్‌ తీసుకుంటారని.. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నపుడు ఫోన్‌ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని ఈనెల 19న మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్‌ ఆరోపించారు. దీంతో ఆయనకు లీగల్‌ నోటీసులు పంపారు బండి సంజయ్‌. తనపై చేసిన కామెంట్లకు ఆధారమైనా చూపించాలి.. లేకుంటే బేషరతుగా క్షమాపణలు చెప్పాలన్నారు కేటీఆర్‌. ఆయన చేసిన కామెంట్లు తన వ్యక్తిత్వాన్ని అవమానపర్చేలా ఉన్నాయని.. క్షమాపణలు చెప్పకపోతే పరువునష్టం దావా వేస్తానన్నారు కేటీఆర్‌.

వారం రోజుల్లో తనపై చేసిన కామెంట్లకు క్షమాపణలు చెప్పాలన్న కేటీఆర్‌కు కౌంటర్‌ ఇచ్చారు బండి సంజయ్‌. క్షమాపణలు చెప్పేదే లేదన్నారు బండి సంజయ్‌. ఆయనకు లీగల్‌ గానే కౌంటర్‌ నోటీసు ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదని.. పొలిటికల్‌ విమర్శలపై నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబట్టారు కేంద్రమంత్రి. లీగల్ నోటీసులకు భయపడేదిలేదని.. తక్షణం ఆరోపణలు వెనక్కి తీసుకోవాలన్నారు. కేటీఆర్‌ తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు బండి సంజయ్‌. ఇద్దరి మధ్య లీగల్‌ బ్యాటింగ్‌ నడుస్తుండగానే.. బండి సంజయ్‌ మరోసారి హాట్‌ కామెంట్స్‌ చేశారు. తాను కిందిస్థాయి నుంచి వచ్చానని.. కేసీఆర్ లేకపోతే కేటీఆర్‌ను ఎవరూ పట్టించుకోరన్నారు.

బీఆర్ఎస్ నేతలు ధర్నా చేయడం ఏంటి..?

తెలంగాణలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కొత్త భాష్యం చెప్పారు కేంద్ర మంత్రి బండి సంజయ్‌. బీఆర్‌ఎస్‌లో కేటీఆర్, హరీష్‌ మధ్య పంచాయతీ నడుస్తోందన్నారు.. ఆ ఇద్దరు సీఎం రేవంత్‌తో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. రాజ్ పాకాల మందు దందాలో దొరికితే బీఆర్ఎస్ నేతలు ధర్నా చేయడం ఏంటని ప్రశ్నించారు బండి సంజయ్.. మూసీ ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదన్నారు బండి సంజయ్. అయితే పేదలను ఇబ్బందిపెడితే మాత్రం ఊరుకోమన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..